మరో సోదరుడిని కోల్పోయిన దిలీప్ కుమార్
బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ మరో సోదరుడిని కోల్పోయారు. ఆయన తమ్ముడు ఇషాన్ ఖాన్ బుధవారం..;
బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ మరో సోదరుడిని కోల్పోయారు. ఆయన తమ్ముడు ఇషాన్ ఖాన్ బుధవారం రాత్రి లీలవతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన COVID-19 తో మరణించాడని.. గతంలోనే ఆయనకు గుండె జబ్బులు, రక్తపోటు, అల్జీమర్స్ వ్యాధులు ఉన్నాయని ఆసుపత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా గత నెలలోనే దిలీప్‌కుమార్ సోదరులు అస్లాంఖాన్, ఇషాన్ ఖాన్‌లు కోవిడ్ లక్షణాలతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ అస్లాం ఖాన్ ముందుగా చనిపోగా.. ఇషాన్ ఖాన్ బుధవారం రాత్రి 11 గంటలకు మరణించారు.