CONGRESS: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల
ఇద్దరు మాజీ కేంద్రమత్రులకు టికెట్లు కేటాయింపు;
ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. ఐదు లోక్‌సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తాజాగా ఆరు లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తంగా 11 లోక్‌సభ, 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది.
లోక్‌సభ అభ్యర్థులు వీరే..
విశాఖపట్నం- పులుసు సత్యనారాయణ రెడ్డి
అనకాపల్లి- వేగి వెంకటేశ్
ఏలూరు- లావణ్య కావూరి
నరసరావుపేట- గార్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్
నెల్లూరు - కొప్పుల రాజు
తిరుపతి (ఎస్సీ)- డా. చింతా మోహన్
అసెంబ్లీ అభ్యర్థులు వీరే..
టెక్కలి- కిల్లి కృపారాణి
భీమిలి - అడ్డాల వెంకట వర్మరాజు
విశాఖ సౌత్ - వాసుపల్లి సంతోష్
గాజువాక - లక్కరాజు రామారావు
అరకు వ్యాలీ (ఎస్టీ)- శెట్టి గంగాధరస్వామి
నర్సీపట్నం - రౌతుల శ్రీరామమూర్తి
గోపాలపురం (ఎస్సీ) - ఎస్. మార్టిన్ లూథర్
ఎర్రగొండపాలెం (ఎస్సీ) - డా. బి.అజితా రావు
పర్చూరు - నల్లగోర్ల శివ శ్రీలక్ష్మి జ్యోతి
సంతనూతలపాడు (ఎస్సీ) - విజేష్ రాజు పాలపర్తి
గంగాధర నెల్లూరు (ఎస్సీ)- డి. రమేష్ బాబు
పూతలపట్టు (ఎస్సీ)- ఎం.ఎస్. బాబు