Asha Parekh : బాలీవుడ్ సీనియర్ నటి ఆశా పరేఖ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్..
Asha Parekh : బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ ఆశా పరేఖ్ కు అరుదైన గౌరవం దక్కింది.;
Asha Parekh : బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ ఆశా పరేఖ్ కు అరుదైన గౌరవం దక్కింది. 2022 సంవత్సరానికి గాను ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది కేంద్రప్రభుత్వం. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ . భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఆమె చేసిన విశేష సేవలకు గాను ఆమెకు ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు. 1992లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం. గతంలో రాజ్ కపూర్, యశ్ చోప్రా, లతా మంగేష్కర్, మృణాల్ సేన్, అమితాబ్ బచ్చన్, ఏఎన్నార్, వినోద్ ఖన్నా తదితరులు అందుకున్నారు. దేవికా రాణి మొదటి విజేత కాగా, రజనీకాంత్‌కు గతేడాది ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును ప్రధానం చేశారు.