Ira Khan: బాయ్‌ఫ్రెండ్‌తో స్విమ్మింగ్ పూల్‌లో స్టార్ హీరో కూతురు రొమాన్స్.. ఫోటోలు వైరల్..
Ira Khan: ఇటీవల ఇరా ఖాన్ తన పుట్టినరోజును జరుపుకుంది. సెలబ్రేషన్స్‌లో తను వేసుకున్న డ్రెస్‌పై సోషల్ మీడియా ఫైర్ అయ్యింది;
Ira Khan: కొందరు నటీనటులు తమకు నచ్చింది మాట్లాడుతూ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అవుతుంటారు. అయితే నటీనటులు మాత్రమే కాదు.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే కొందరు స్టార్ల వారసులు కూడా కాంట్రవర్సీలకు కారణమవుతారని అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్‌ను చూస్తుంటే అనిపిస్తుంది. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా బికినీ ఫోటోలు షేర్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇరా.. ఈసారి ఏకంగా తన బాయ్‌ప్రెండ్‌తో దిగిన ఫోటోలనే పోస్ట్ చేసింది.
అమీర్ ఖాన్‌కు బాలీవుడ్‌లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనే పేరు ఉంది. కానీ అమీర్ ఎప్పుడూ తన పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా బయటపడలేదు. పెళ్లి, విడాకులు లాంటి వాటి వల్ల అమీర్ పర్సనల్ లైఫ్ కొంచెం బయటపడినా.. అంతకు మించి తాను పెద్దగా తన గురించి ఎవరికీ తెలియనివ్వలేదు. అమీర్ ఖాన్ కూతురు ఇరా కూడా సోషల్ మీడియా ద్వారానే బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. నచ్చింది చేసే మనస్థత్వం కావడంతో ఇరా ఏం చేసినా సెన్సేషన్‌గా నిలుస్తుంది.
ఇటీవల ఇరా ఖాన్ తన 25వ పుట్టినరోజును జరుపుకుంది. ఆ సెలబ్రేషన్స్‌లో ఇరా వేసుకున్న దుస్తులపై సోషల్ మీడియా అంతా ఫైర్ అయ్యింది. అయితే ఈ ట్రోల్స్ అన్నింటిని ఇరా చాలా లైట్ తీసుకుంది. అంతే కాకుండా తన బాయ్‌ఫ్రెండ్‌తో స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఫోటోలను స్పెషల్‌గా పోస్ట్ చేసింది. 'రెండేళ్లే అయినప్పటికీ ఎప్పటినుండో అన్నట్టుగా అనిపిస్తోంది. ఐ లవ్ యూ' అన్న క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2021లో ఇరా ఖాన్.. నుపూర్ శిఖారే అనే ఫిట్‌నెస్ ట్రైనర్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించింది.