John Abraham: జాన్ అబ్రహమ్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయ్యిందా? లేదా.. కావాలనే చేశాడా?
John Abraham: సినిమావారిని, ఇతర సెలబ్రిటీలను తమ ఫ్యాన్స్‌కు ఎప్పుడూ దగ్గరగా ఉంచే సాధనమే సోషల్ మీడియా.;
John Abraham (tv5news.in)
John Abraham: సినిమావారిని, ఇతర సెలబ్రిటీలను తమ ఫ్యాన్స్‌కు ఎప్పుడూ దగ్గరగా ఉంచే సాధనమే సోషల్ మీడియా. అందులోనూ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ వల్లే ఫ్యాన్స్‌కు తమ అభిమాన నటీనటులు ఏం చేస్తు్న్నారో అప్డేట్ లభిస్తోంది. అందుకే సెలబ్రిటీలు కూడా ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. కానీ ఈ బాలీవుడ్ నటుడు మాత్రం ఉన్నట్టుండి మనసు మార్చుకున్నట్టు ఉన్నాడు.
బాలీవుడ్ సీనియర్ హీరో జాన్ అబ్రహం డిసెంబర్ 17న తన 49వ ఏట అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం ఈ హీరో 'అటాక్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను లక్ష్య రాజ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు. జాక్విలిన్ ఫెర్నాండెస్ హీరోయిన్‌గా నటిస్తున్న అటాక్ టీజర్ ఇటీవల విడుదలయ్యింది. అయితే అంతా బాగానే ఉన్నా జాన్ అబ్రహమ్ మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌కు ఎందుకో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తోంది.
రెండు రోజుల క్రితం జాన్ అబ్రహం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుండి పోస్టులు అన్నింటిని డిలీట్ చేశాడు. అంతే కాకుండా తన డీపీని కూడా తీసేశాడు. పుట్టినరోజుకు ముందు జాన్ ఎందుకిలా చేస్తున్నాడని ప్రేక్షకుల్లో సందేహాలు మొదలయ్యాయి. పైగా ఇలా ఎందుకు చేశాడో జాన్ ఇప్పటివరకు చెప్పలేదు. ఒకవేళ అకౌంట్ హ్యాక్ అయ్యింది అనుకున్నా కూడా అదే విషయాన్ని జాన్ మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు.