సోదరితో కలిసి బాంద్రా పోలీస్ స్టేషన్‌లో హాజరైన కంగనా
సోషల్ మీడియాలో కొన్ని అభ్యంతరకర పోస్టులు పెట్లినట్లు కంగనా రనౌత్‌తోపాటు ఆమె సోదరి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.;
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌ను దేశ ద్రోహం కేసు వెంటాడుతోంది. సోదరి రంగోలితో కలిసి శుక్రవారం ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. దేశద్రోహం ఆరోపణలపై పోలీసులు కంగనాతోపాటు రంగోలి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. సోషల్ మీడియాలో కొన్ని అభ్యంతరకర పోస్టులు పెట్లినట్లు కంగనా రనౌత్‌తోపాటు ఆమె సోదరి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
వీరిద్దరిపై గత నవంబర్ నెలలో కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఈ కేసులను సవాలు చేస్తూ కంగనా ముంబాయి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు స్టేట్‌మెంట్ రికార్డు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తోందని.. అంతకు ముందు ఆమె ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తమ తప్పేమీ లేకుండా కేసులు పెట్టారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనవసరంగా తన ఆఫీసును కూల్చేశారని ఆమె మండిపడ్డారు.