Nayanthara: నయనతారను తక్కువ చేస్తూ డైరెక్టర్ వ్యాఖ్యలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

Nayanthara: నయనతారను సౌత్‌లో లేడీ సూపర్ స్టార్ అని ప్రేమగా పిలుచుకుంటారు ఫ్యాన్స్.

Update: 2022-07-24 15:30 GMT

Nayanthara: నయనతారను సౌత్‌లో లేడీ సూపర్ స్టార్ అని ప్రేమగా పిలుచుకుంటారు ఫ్యాన్స్. కమర్షియల్ సినిమా అయినా, లేడీ ఓరియెంటెడ్ చిత్రమైనా.. తన నటనతో హిట్ చేయించాలని నయన్ ప్రయత్నిస్తూ ఉంటుంది. అంతే కాకుండా పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో పవర్‌ఫుల్ పాత్రలు చేసి విపరీతమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. అలాంటి నయన్ గురించి ఓ డైరెక్టర్ చాలా తక్కువ చేసి మాట్లాడడం సంచలనం సృష్టించింది.

ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొని ప్రేక్షకులను అలరించింది సమంత. ఇప్పటివరకు ఒక్క హిందీ సినిమా కూడా చేయకుండా సామ్.. అంత పెద్ద హిందీ టాక్ షోలో పాల్గొనడం తన ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసింది. అయితే ఈ షోలో 'ప్రస్తుతం సౌత్‌లో ఎవరు పెద్ద నటీమణి అనుకుంటున్నావు' అని సామ్‌ను అడిగాడు కరణ్. దీనికి సమాధానంగా సామ్.. 'నేను ఇటీవల నయనతారతో ఓ సినిమా చేశాను. సౌత్ పరిశ్రమల్లో తనే పెద్ద నటి అని నేను అనుకుంటున్నాను' అని సమాధానం ఇచ్చింది. దీనికి కరణ్ సింపుల్‌గా 'నా లిస్ట్‌లో లేదు' అని అన్నాడు.



కరణ్ జోహార్ అన్న మాటకు నయన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కరణ్‌కు సౌత్ ఇండస్ట్రీ నటీనటులంటే పడదని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కరణ్ నిర్మిస్తున్న జాన్వీ కపూర్ మూవీ 'గుడ్ లక్ జెర్రీ'.. నయన్ నటించిన 'కొలమాను కోకిల' రీమేక్ అని మర్చిపోవద్దని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సౌత్ నటీనటులపై కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేసిన కరణ్.. మరోసారి నయన్ గురించి అలా అనడం హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News