Kareena Kapoor: కరీనా ఇల్లు సీజ్.. ఇంటి ముందు పోస్టర్..
Kareena Kapoor: కోవిడ్ సోకినా కూడా.. అది తీవ్రంగా ఉంటేనే ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు వైద్యులు.;
Kareena Kapoor (tv5news.in)
Kareena Kapoor: కోవిడ్ సోకినా కూడా.. అది తీవ్రంగా ఉంటేనే ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు వైద్యులు. లేకపోతే ఎక్కువశాతం హోమ్ క్వారంటీన్‌లోనే ఉండాలని సలహా ఇస్తున్నారు. అయితే ఆ సమయంలో కరోనా సోకిన వారి ఇంటికి ఎవరూ వెళ్లకుండా దానికి సీల్ వేస్తారు. ప్రస్తుతం బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఇంటికి కూడా అలాగే సీల్ పడింది.
ఇటీవల బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ కరోనా బారిన పడినట్లుగా నిర్ధారణ అయ్యింది. డిసెంబర్ 13న తనకు కరోనా వచ్చినట్టు బయటపడింది . దీంతో డిసెంబర్ 14న అధికారులు తన ఇంటిని పూర్తిగా శానిటైజ్ చేశారు. తాను హోమ్ క్వారంటీన్‌లో ఉండాలని సూచించారు. అంతే కాకుండా కరోనా ఇంటిని సీజ్ కూడా చేశారు.
మామూలుగా కరోనా సోకిన వారితో ఎవరూ కాంటాక్ట్‌లో ఉండకూడదు. కానీ ఫలానా ఇంట్లో ఉన్న వారికి కరోనా సోకిందని, ఆ ఇంట్లోకి ఎవరూ వెళ్లకూడదని చెప్పేలాగా అధికారులు ఆ ఇంటి ముందు ఓ పోస్టర్‌ను కూడా అంటిస్తారు. అలాగే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.. కరీనా ఇంటిని సీజ్ చేయడంతో పాటు ఇంటి ముందు పోస్టర్ అంటించారు.