Katrina Kaif duplicate : కత్రినా డూప్.. సోషల్ మీడియా షేక్..!
Katrina Kaif duplicate : సాధారణంగా మనుషులను పోలిన మనుషులు ఉండడం సహజమే. అలానే ఎంతో మంది సినీ తారల పోలికలతో ఉన్న వాళ్లను రోజు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం...;
Katrina Kaif: సాధారణంగా మనుషులను పోలిన మనుషులు ఉండడం సహజమే. అలానే ఎంతో మంది సినీ తారల పోలికలతో ఉన్న వాళ్లను రోజు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం.
అదేవిధంగా ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ కత్రినాకి కూడా అచ్చం డిటోలా ఉన్న కార్టూన్ కాపీ దొరికేసింది. ఇంకా చెప్పాలి అంటే.. వీళ్ల ఇద్దరిలో అసలు నిజమైన కత్రినా ఎవరంటే చెప్పడం కొంచెం కష్టమే అనుకోండి. అంతలా ఇద్దరికీ దగ్గరి పోలికలున్నాయి.
ఇంతకీ కత్రినాల ఉన్న ఆ డూప్ పేరు ఏంటో ఇంకా చెప్పలేదు కదూ. ఆమె పేరు అలీనా రాయ్... ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన పిక్స్‌తో 2లక్షల ఫాలోవర్లను సంపాదించి సోషల్ స్టార్‌గా మారిపోయింది. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు అరె అచ్చం కత్రినానే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కత్రినా సల్మాన్ ఖాన్‌తో కలిసి టైగర్3 షూటింగ్‌లో బిజీగా ఉంది.