Naga Chaitanya: త్వరలో హీరోగా చైతూ బాలీవుడ్ ఎంట్రీ.. లైన్‌లో స్టార్ డైరెక్టర్స్..

Naga Chaitanya: లాల్ సింగ్ చడ్డా మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న నాగచైతన్యపై ఓ రూమర్ వైరల్ అయ్యింది.

Update: 2022-08-04 11:15 GMT

Naga Chaitanya: ప్రస్తుతం ఒక భాష హీరో ఈ భాషలోనే నటించాలి అని పరిమితులు పెట్టుకోవడం లేదు. ఇతర భాషా దర్శకులతో పనిచేయడానికి, వేరే భాషా చిత్రాల్లో నటించడానికి స్టార్ హీరోలు సైతం వెనకాడడం లేదు. ఇక చాలామంది తెలుగు హీరోలు కూడా ఇప్పటికే బాలీవుడ్ మార్కెట్‌పై కన్ను వేశారు. అంతే కాకుండా స్ట్రెయిట్ హిందీ మూవీలో నటించడానికి ఓకే చెప్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి నాగచైతన్య కూడా యాడ్ అయ్యాడు.

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నాగచైతన్య. కెరీర్ మొదట్లో కమర్షియల్ హీరో అవ్వడానికి ప్రయత్నించినా కూడా ఆ తర్వాత చేసిన ప్రేమకథలే తనకు హిట్ తెచ్చిపెట్టాయి. ఇప్పుడు తనకంటూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా ముద్రపడింది. ఇక తాజాగా అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చడ్డా'లో ఓ కీలక పాత్రతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నాడు చైతూ. ఈ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న నాగచైతన్యపై ఓ రూమర్ వైరల్ అయ్యింది.

ముంబాయిలో లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న చైతూ.. దాని తర్వాత సంజయ్ లీలా భన్సాలీ ఆఫీస్ వద్ద కనిపించాడు. అంతే కాకుండా కరణ్ జోహార్‌తో కూడా నాగచైతన్య భేటీ అయినట్టు సమాచారం. నాగచైతన్య హిందీలో స్ట్రెయిట్ మూవీ చేయడం కోసమే వీరితో చర్చలు జరుగుతున్నాయని బీ టౌన్ ప్రేక్షకులు గుసగుసలాడుకుంటున్నారు.



Tags:    

Similar News