Nawazuddin Siddique: నటుడిపై రేప్ కేస్ పెట్టిన భార్య...

నవాజుద్దీన్ సిద్ధికీపై మరో కేసు పెట్టిన భార్య ఆలియా; లైంగిక దాడి కేసులో తన వద్ద ఆధారాలు ఉన్నాయని వెల్లడి

Update: 2023-02-25 09:23 GMT
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధీఖీపై అతడి భార్య ఆలియా కీలక  ఆరోపణలు చేసింది. తన భర్త పై వస్తోన్న లైంగిక దాడి ఆరోపణలపై తన వద్ద కీలక ఆధారాలు ఉన్నయని వెల్లడించింది. ఇటీవలే నవాజుద్దీన్ పై అతడి పనిమనిషి లైంగిక దాడి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను దుబాయ్ లో వదలి వచ్చేశాడని, ఎలాగైనా తనని కాపాడమని భారత  అధికారులకు వీడియో ద్వారా విన్నవించుకుంది. మరోవైపు నవాజుద్దీన్, ఆలియా కూడా మనస్ఫర్ధల కారణంగా విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో భార్య ఆలియా నవాజుద్దీన్ పై పలు ఆరోపణలు చేస్తున్నారు. నవాజుద్దీన్, అతడి తల్లి తనను చిత్రహింసలకు గురిచేసినట్లు వెల్లడించారు. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన తనకు స్నానాల గదితో పాటూ, వంటగదిలోకి కూడా అనుమతి నిరాకరించారని ఆరోపించింది. ఇక  నటుడు ఎదుర్కొంటున్న లైంగిక దాడి ఆరోపణలు వాస్తవమేనని వెల్లడంచింది. తన వద్ద దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, పోలీసులకు వాటిని అందజేయనున్నామని తెలిపింది. 
Tags:    

Similar News