Pathan fever: మూడు రోజుల్లో రూ.300 కోట్ల కలెక్షన్స్!
బాలీవుడ్‌లో జోష్ నింపిన పఠాన్; సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సినిమా; విడుదలైన అన్ని భాషల్లో, అన్ని దేశాల్లో కొత్త రికార్డులు...;
బాలీవుడ్‌కు పఠాన్ సినిమా మంచి కిక్కిచ్చి.. సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన అన్ని దేశాల్లో.. అన్ని భాషల్లో కొత్త రికార్డులను సృష్టించింది. పఠాన్ కలెక్షన్ల సునామీలో పాత రికార్డులు తుడుచుకుపోయాయి. ఇప్పటి వరకు కేజీఎఫ్ 2 పేరున ఉన్న అన్ని రికార్డులు బద్దలు చేసేందుకు రెడీ అవుతోంది. మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 219 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు నిర్మాతలు తెలిపారు. మూడో రోజు కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో నడుస్తోందని.. మూడు రోజుల్లో కలెక్సన్స్ 300 కోట్ల రూపాయలను దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.