Pooja Hegde: బాలీవుడ్‌పై పూజా ఫొకస్.. ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రయత్నాలు..
Pooja Hegde: ముందుగా హృతిక్ రోషన్ సరసన ‘మోహంజోదారో’ సినిమాలో నటించింది పూజా.;
Pooja Hegde: చాలామంది నటీనటులు కేవలం ఒక భాషకే పరిమితం అయిపోకుండా.. చాలా భాషల్లో నటించాలి, చాలా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ ప్రారంభమయిన తర్వాత ఆటోమేటిక్‌గా నటీనటులు ఇతర భాషా ప్రేక్షకులకు దగ్గరయిపోతున్నారు. కానీ ఈ పాన్ ఇండియా చిత్రాలు పూజా హెగ్డేకు కలిసి రాకపోవడంతో.. తాను బాలీవుడ్‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడానికి సిద్ధమయినట్టు తెలుస్తోంది.
పూజా హెగ్డే కెరీర్ ముందుగా సౌత్‌లోనే ప్రారంభమయ్యింది. తమిళంలో హీరోయిన్‌గా పరిచమయమయిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగు చిత్రాల ద్వారా స్టార్‌డమ్ తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి, సీనియర్ హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకుంది. ఈమధ్యలో తనకు హిందీ నుండి కూడా ఆఫర్లు వచ్చాయి. కానీ అవేవి హిట్ వరకు వెళ్లలేదు.
ముందుగా హృతిక్ రోషన్ సరసన 'మోహంజోదారో' సినిమాలో నటించింది పూజా. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో పూజాకు ఎక్కువగా హిందీలో అవకాశాలు రాలేదు. ఆ తర్వాత హౌస్‌ఫుల్ 4లో కనిపించినా.. అది మల్టీ స్టారర్ కావడంతో తనకు ప్రత్యేకంగా గుర్తింపు లభించే అవకాశం లేకుండా పోయింది. ఇక చాలాకాలం తర్వాత హిందీలో అవకాశాలు అందడంతో స్పీడ్ పెంచింది ఈ భామ.
ప్రస్తుతం రణవీర్ సింగ్‌తో 'సర్కస్' అనే చిత్రంలో నటిస్తోంది పూజా. అంతే కాకుండా సల్మా్న్ ఖాన్‌తో 'భాయ్‌జాన్' చిత్రం చేస్తోంది. ఈ రెండు సినిమాలు ఒక వారం వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. పూజా ప్రస్తుతం.. తన ఆశలన్నీ ఈ రెండు చిత్రాలపైనే పెట్టుకుంది. ఎన్నో అంచనాల మధ్య విడులదయిన బీస్ట్, రాధే శ్యామ్.. పూజాకు అనుకున్నంత రేంజ్‌లో హిట్‌ను అందించలేకపోయాయి.