Ranbir Kapoor : అప్పుడు తినాలనిపించదు.. నిరాశలోకి వెళ్ళిపోతా..
Ranbir kapoor : బ్రహ్మాస్త్రం మూవీతో పెద్ద సక్సస్ కొట్టిన రణ్‌బీర్, అలియా ప్రస్తుతం ఆ మూవీకి సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు;
Ranbir Kapoor : బ్రహ్మాస్త్రం మూవీతో పెద్ద సక్సస్ కొట్టిన రణ్‌బీర్, అలియా ప్రస్తుతం ఆ మూవీకి సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో రణ్‌బీర్‌ను.. ' మీరూ, అలియా భట్ ఒకే రంగంలో ఉన్నారు.. ఒకరిపైన ఒకరు ఆధారపడుతుంటారా' అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. 'నేను ఇండిపెండెంట్‌గా ఉండటానికి ట్రై చేస్తా కానీ అలియా లేకుండా ఉండలేకపోతున్న. అలియా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లాలనిపిస్తుంది. అలియా లేకపోతే చాలా నిరుత్సాహంలోకి జారిపోతా.. తను లేకపోతే తినాలని కూడా అనిపించదు' అని రణ్‌బీర్ మీడియాకు చెప్పారు.
రణ్‌బీర్ అలియా తమ కెరీర్‌లో హిట్స్ తో మంచి అవకాశాలతో దూసుకుపోతున్నారు. రణ్‌బీర్ కపూర్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో యానిమల్ సినిమా రాబోతోంది. ఇక అలియా హార్ట్ ఆఫ్ స్టోన్ అనే హాలీవుడ్ చిత్రంలో కనిపించనుంది.