Ranbir Kapoor: పుష్ప పాత్ర చేయాలనుంది: రణబీర్ కపూర్
Ranbir Kapoor: ఇప్పటికే బాలీవుడ్‌లో కూడా సౌత్ సినిమాల డామినేషన్ ఎక్కువయిపోయింది. అది కూడా పుష్పతోనే మొదలయ్యింది.;
Ranbir Kapoor: పుష్ప, తగ్గెదె లె.. ఈ డైలాగులకు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో ఇప్పటికే చాలా సందర్భాల్లో చూశాం. అంతర్జాతీయ నటీనటులు, క్రికెటర్లు.. ఇప్పటికీ ఎన్నోసార్లు మన పుష్ప తగ్గెదె లె అన్న డైలాగును ఇమిటేట్ చేశారు. ఆ రేంజ్‌లో ఉంది ప్రస్తుతం పుష్ప క్రేజ్. బాలీవుడ్‌లో సైతం పుష్ప డామినేషన్ చాలాకాలం కొనసాగింది. ఇక తాజాగా మరో బాలీవుడ్ హీరో కూడా పుష్ప మీద ఇష్టాన్ని బయటపెట్టాడు.
ఇప్పటికే బాలీవుడ్‌లో కూడా సౌత్ సినిమాల డామినేషన్ ఎక్కువయిపోయింది. అది కూడా పుష్పతోనే మొదలయ్యింది. పుష్ప తర్వాత వరుసగా పాన్ ఇండియా చిత్రాలు విడుదలయ్యి హిందీ ఇండస్ట్రీలో కూడా సత్తా చాటాయి. కానీ ముఖ్యంగా పుష్స మ్యానరిజం మాత్రం భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే రణబీర్ కపూర్ కూడా ఇటీవల పుష్పపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం రణబీర్ కపూర్.. షంషేరా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ జులై 22న విడుదల కానుంది. దీంతో షంషేరా మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో రణబీర్ బీజీగా ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణబీర్‌కు ఇటీవల మీరు చేయాలనుకున్న పాత్ర ఏంటి అనే ప్రశ్న ఎదురయ్యింది. దానికి తాను అల్లు అర్జున్ నటించిన పుష్ప రాజ్ రోల్ తనకు చాలా నచ్చిందని, ఆ రోల్ తాను చేయాలనుకుంటున్నానని చెప్పాడు. అంతే కాకుండా పుష్ప పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నానని అన్నాడు. తన పెట్ డాగ్‌తో కలిసి క్యూట్‌గా పుష్ప మ్యానరిజంను కూడా చేసి చూపించాడు రణబీర్.