బాబు బంగారు స్పూను.. షూస్ ధర లక్షల్లో మరి..
కానీ కళ్లన్నీ అతడు ధరించిన స్నీకర్స్ (స్పోర్ట్స్ షూస్) మీదకు వెళ్లాయ. నైకి అండ్ డియోర్ లిమిటెడ్ ఎడిషన్‌గా వచ్చిన;
అమ్మానాన్నలు మంచి స్టార్స్.. వాళ్లు పేరుతో పాటు, డబ్బూ సంపాదించారు. నటనను వారసత్వంగా పుచ్చుకున్నా తానూ బెస్ట్ యాక్టర్ అని నిరూపించుకున్నాడు బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్. వెండితెర వేలుపులు బయట కనిపిస్తే కెమెరా కళ్లన్నీ వాళ్లనే ఫాలో అవుతుంటాయి. ఫ్యాషన్‌కి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచే హీరోలు అడుగడుగునా తమ ఆహార్యంలో కొత్త దనాన్ని కోరుకుంటారు.. అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఫ్యాన్స్ తమ గురించే మాట్లాడుకునేలా చేస్తారు.
తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో రణ్‌బీర్ కపూర్ బ్లూ జీన్స్ ధరించి, చేతిలో స్టైయిలిష్ బ్యాగ్‌తో మెరిసిపోయాడు. కానీ కళ్లన్నీ అతడు ధరించిన స్నీకర్స్ (స్పోర్ట్స్ షూస్) మీదకు వెళ్లాయ. నైకి అండ్ డియోర్ లిమిటెడ్ ఎడిషన్‌గా వచ్చిన ఈ స్నీకర్స్ వెల దాదాపు ఐదున్నర లక్షల రూపాయలట. అందరి కోసం కాదండి.. స్పెషల్ పర్సన్స్ కోసం మాత్రమే డిజైన్ చేశామంటూ.. కంపెనీ ఇలాంటి షూస్‌ని కేవలం 8000 జతలు మాత్రమే తీసుకువచ్చిందట. వాటిలో ఒకటి రణ్‌బీర్ పాదాల్లో దూరి ఫోజు కొడుతోంది. ఇక అతగాడు ధరించిన డ్రెస్, బ్యాగు కూడా జస్ట్ ల్యాక్స్‌లోనేనంట.
అంతేనండి మరి గోల్డెన్ స్పూన్‌తో పుడితే యవ్వారం అలానే ఉంటుంది. తల్లిదండ్రులు రిషికపూర్, నీతూ కపూర్ సంపాదించిన ఆస్తితో పాటు అతడు కూడా బ్యాంకు బ్యాలెన్స్ బాగానే పెంచుకున్నాడు. ఇక ఆలియాతో డేటింగ్, సినిమాలు, షికార్లు ఓహ్.. చాలా ఉంది రణ్‌బీర్ చిట్టా. గత ఏడాది ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒకింటి వారవుదామనుకున్నారు.. కానీ కరోనా వచ్చి కళ్యాణ తేదీని పోస్ట్‌పోన్ చేసింది. కాగా రణ్‌బీర్, ఆలియా కలిసి నటించిన 'బ్రహ్మాస్త్ర' ఈ సంవత్సరం విడుదల కావాల్సి ఉంది.