Rashmika Mandanna: బాలీవుడ్‌లో రష్మికకు మరో ఆఫర్.. ఆ యంగ్ హీరో సరసన..
Rashmika Mandanna: రష్మిక.. సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తున్న ‘మిషన్ మజ్ను’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది.;
Rashmika Mandanna: పాన్ ఇండియా సినిమాలు చేసినా కూడా.. కొందరు హీరోయిన్లకు అదృష్టం కలిసి రావట్లేదు. కానీ రష్మిక అలా కాదు.. చేసింది ఒక్క పాన్ ఇండియా సినిమానే. కానీ బాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. పుష్ప విడుదల అవ్వకముందే రెండు హిందీ ఆఫర్లను దక్కించుకున్న ఈ కన్నడ బ్యూటీ.. విడుదల తర్వాత కూడా ఆఫర్ల మీద ఆఫర్లతో దూసుకుపోతోంది.
రష్మిక.. సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తున్న 'మిషన్ మజ్ను' చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాతో పాటు రష్మికకు అమితాబ్ బచ్చన్‌తో నటించే అవకాశం కూడా వచ్చింది. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో 'గుడ్‌బై' చిత్రం ఇటీవల షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అంతే కాకుండా రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కతున్న 'యానిమల్' షూటింగ్‌లో కూడా రష్మిక ఇప్పటికే జాయిన్ అయ్యింది. ఇప్పుడు మరో యంగ్ హీరోతో ఈ భామ జోడీకట్టనుందని సమాచారం.
'భూల్ భులయ్యా 2'తో బాలీవుడ్‌లో కాస్త హిట్ వాతావరణం తీసుకొచ్చాడు కార్తిక ఆర్యన్. దీంతో ఈ హీరోకు ఆఫర్ల వర్షం కురుస్తోంది. అందులో చాలావరకు నచ్చిన ప్రాజెక్టులకు కార్తిక గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడట. ఇక త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న కొత్త చిత్రంతో రష్మిక హీరోయిన్‌గా నటించనుందని టాక్ వినిపిస్తోంది. తనతో పాటు మరికొందరు సౌత్ నటీనటులు కూడా ఈ సినిమాలో భాగమవ్వనున్నారని సమాచారం.