Shikhar Dhawan: సినిమా హీరోగా మరో క్రికెటర్.. ఇప్పటికే షూటింగ్ పూర్తి..
Shikhar Dhawan: ఇండియన్ క్రికెటర్స్‌లో ఇప్పటివరకు హర్భజన్ సింగ్ , శ్రీశాంత్ నటులుగా ప్రేక్షకులను మెప్పించారు.;
Shikhar Dhawan: సినీ పరిశ్రమ అంటే ఓ రంగుల ప్రపంచం. చాలామందికి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని ఉంటుంది. కానీ కొందరికే ఆ అవకాశం లభిస్తుంది. సినిమాల్లోకి రావాలనుకొని అది కుదరక వేర్వేరు రంగాల్లో ఫేమస్ అయిన వారు కూడా ఉన్నారు. అయితే వారిలో చాలామంది మళ్లీ సినిమాల మీద ఇష్టంతో యాక్టింగ్ వైపు అడుగులేస్తుంటారు. అందులో ముందంజలో ఉంటారు క్రికెటర్స్.
క్రికెట్, సినిమా.. ఈ రెండు బాగా పేరుతెచ్చే రంగాలే. కానీ కొందరు క్రికెటర్లు ఆటగాళ్లుగా పేరు సాధించిన తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఇండియన్ క్రికెటర్స్‌లో ఇప్పటివరకు హర్భజన్ సింగ్ , శ్రీశాంత్ నటులుగా ప్రేక్షకులను మెప్పించారు. ఇక కెప్టెన్ కూల్ ఎమ్ ఎస్ ధోనీ కూడా త్వరలోనే సినీ రంగంలో నిర్మాతగా అడుగుపెట్టనున్నాడు. తాజాగా మరో క్రికెటర్ కూడా నటుడిగా మారనున్నట్టు టాక్ వినిపిస్తోంది.
తన గేమ్‌లో ఇప్పటికే క్రికెట్ లవర్స్‌ను ఇంప్రెస్ చేశాడు శిఖర్ ధావన్. అయితే ధావన్‌కు యాక్టింగ్ అంటే కూడా చాలా ఇష్టమట. అయితే ఎప్పటినుండో సోలో హీరోగా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న ధావన్.. ఒక మూవీ కూడా పూర్తి చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఇక క్రికెటర్‌గా ధావన్‌ను చూసిన ప్రేక్షకులు.. ఈ ఏడాది చివరిలోపు హీరోగా కూడా చూడనున్నట్టు సమాచారం.