Sonakshi Sinha Engagement: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బాలీవుడ్ నటి.. ఇంతకీ ఫోటోలో ఉంది ఎవరు..?
Sonakshi Sinha Engagement: సోనాక్షి, జహీర్ కలిసి ప్రస్తుతం ‘డబుల్ ఎక్స్‌ఎల్’ అనే చిత్రంలో నటిస్తున్నారు.;
Sonakshi Sinha Engagement: ఈమధ్య నటీనటులు తమ రిలేషన్‌షిప్‌ను సీక్రెట్‌గా ఉంచడానికే ఇష్టపడుతున్నారు. ఒకవేళ ఆ విషయం పొరపాటున బయటికి వచ్చినా దాని గురించి పెద్దగా స్పందించడానికి కూడా వారు ఇష్టపడట్లేదు. కొందరు అలా సీక్రెట్‌గా, ఎంగేజ్‌మెంట్, పెళ్లి కూడా చేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి చేరింది బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా.
సల్మాన్ ఖాన్‌లాంటి స్టార్ హీరో సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సోనాక్షి. అంతే డెబ్యూతోనే అందరి చూపు తనవైపు తిప్పుకుంది. బాలీవుడ్‌లో తనకు హీరోయిన్‌గా వెంటవెంటనే ఆఫర్లు క్యూ కట్టాయి. కొన్నా్ళ్ల తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది సోనాక్షి. అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సోనాక్షి ఎంగేజ్‌మెంట్ అయిపోయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం వైరల్ అవుతున్న తన ఫోటోనే.
బాలీవుడ్‌లో హీరోగా అనుభవం ఉన్నది ఒక్క చిత్రమే అయినా.. సోనాక్షి సిన్హాతో డేటింగ్ చేస్తున్నాడు జహీర్ ఇక్బాల్. సోనాక్షి, జహీర్ కలిసి పలుమార్లు పార్టీల్లో కలిసి కనిపించారు. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని బాలీవుడ్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కలిసి తిరుతున్నా కూడా ఈ విషయంపై వీరిద్దరూ స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజమే అని అందరూ ఫిక్స్ అయిపోయారు.
సోనాక్షి, జహీర్ కలిసి ప్రస్తుతం 'డబుల్ ఎక్స్‌ఎల్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇదే సమయంలో సోనాక్షి షేర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. 'ఇది నాకెంతో ప్రత్యేకమైన రోజు. నా కల నిజం కాబోతుంది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి ఎదురుచూస్తున్నాను' అంటూ సోనాక్షి తన రింగ్ ప్రత్యేకంగా కనిపించేలా ఓ పోస్ట్ చేసింది. కానీ అందులో తనతో పాటు ఉన్న వ్యక్తి ఎవరో మాత్రం చూపించలేదు. దీంతో ఈ పోస్ట్ బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేస్తోంది.