ఏదైనా మూవీ హిట్ అయితే సీక్వెల్ కామన్ అయిపోయిందిప్పుడు. ఒకప్పుడు ముని అనే మూవీతో హిట్ అందుకున్న లారెన్స్ దాన్ని కంటిన్యూ చేస్తూ కాంచన, కాంచన2, గంగ అంటూ ఓ ఫ్రాంచైజీయే మొదలుపెట్టాడు. త్వరలోనే ఈ ఫ్రాంచైజీ నుంచి మరో మూవీ రాబోతోంది. ఇలాగే చంద్రముఖిని బాలీవుడ్ ‘భూల్ బులయ్యా’అంటూ ఫ్రాంచైజీగా మార్చింది. ఇందులో థర్డ్ పార్ట్ నవంబర్ 1న విడుదల కాబోతోంది. అలా ఇక స్త్రీ కూడా మారబోతోంది.
కొన్ని దశాబ్దాల క్రితం సౌత్ లో ప్రతి ఊరిలో ఓస్త్రీ రేపు రా అనే మాటలు ఉండేవి. దాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ లో 2018 లో అమర్ కౌశిక్ రూపొందించిన హారర్ కామెడీ సూపర్ హిట్ అయింది. దానికి సీక్వెల్ గా రీసెంట్ గా స్త్రీ 2 వచ్చింది. ఇది రికార్డులు బ్రేక్ చేస్తూ ఏకంగా కేవలం హిందీ భాషలోనే 500 కోట్లు వసూళ్లు చేసి బాలీవుడ్ కు షాక్ ఇచ్చింది. రెండు భాగాల్లోనూ ప్రధాన పాత్రలో శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి లే నటించారు. సో.. ఇంత పెద్ద క్రేజ్ వచ్చిన ఈ మూవీని మాత్రం ఎలా వదిలేస్తారు. అందుకే స్త్రీని కూడా ఫ్రాంచైజీగా మార్చారు.
ఈ ఫ్రాంచైజీ నుంచి మూడో భాగం కూడా రాబోతోంది. ఆల్రెడీ స్క్రీప్ట్ వర్క్ పూర్తయిందట. ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి చాలా వేగంగా సినిమాను కూడా పూర్తి చేసి వీలైనంత త్వరగా విడుదల చేయబోతున్నట్టు శ్రద్ధా కపూర్ స్వయంగా చెప్పింది. ఈ చిత్రానికి కూడా సేమ్ టీమ్ పని చేస్తుందట. మరి ఈ మూడో స్త్రీ ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.