Thank God Movie : 'థాంక్ గాడ్' చిత్ర యూనిట్‌కు బిగ్ షాక్..

Thank God Movie : అజయ్ దేవగన్ ‘థ్యాంక్ గాడ్’ చిత్ర యూనిట్‌కు బ్యాడ్ న్యూస్

Update: 2022-09-17 14:18 GMT

Thank God Movie : అజయ్ దేవగన్ 'థ్యాంక్ గాడ్' చిత్ర యూనిట్‌కు బ్యాడ్ న్యూస్. ఇటీవళ థ్యాంక్ గాడ్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయి మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇందులో మత విశ్వాసాలను దెబ్బ తీసే సీన్లు, పాత్రలు ఉన్నాయని పలువురు కేసు నమోదు చేశారు. దీంతో కువైట్ ప్రభుత్వం ఈ చిత్రాన్ని అక్కడ రిలీజ్ చేయలేమని ప్రకటించింది. అభ్యంతరాలున్న సీన్లను, పాత్రలను మార్చితే మాత్రమే తాము అనుమతిస్తామని కువైట్ సెన్సార్ బోర్డ్ ప్రకటించింది.

'థ్యాంక్ గాడ్' ఓ ఫ్యాంటసీ కామెడీ చిత్రం. సిద్ధార్ద్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్, అజయ్ దేవగణ్ ముఖ్య ప్రాతల్లో నటిస్తున్నారు. చంద్రగుప్తిడి పాత్రలో అజయ్ దేవగన్ కనిపిస్తారు. అక్టోబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది.

Tags:    

Similar News