గుంటూరులో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళి అర్పించారు టీడీపీ శ్రేణులు. వేడుకల్లో కోవెల మూడి రవీంద్ర,దాసరి రాజా, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ కూచిపూడి విజయ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్‌పై అనేక పుస్తకాలు రచించిన పీవీఎస్ రామకృష్ణ దంపతులను సన్మానించారు టీడీపీ నేతలు. మహానాడు వేదికగా చంద్రబాబు ఎన్నికల శంఖారావాన్ని పూరించారని అన్నారు టీడీపీ నేతలు. వైసీపీ అరాచకాలపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనన్నారు.