ఎన్టీఆర్‌ తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక : ప్రధాని మోదీ

Update: 2023-05-28 08:35 GMT

టీడీపీ వ్యవస్థాపకులు, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక.. ఎన్టీఆర్‌ను ప్రధాని మోదీ స్మరించుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మన్‌కీ బాత్‌ 101వ ఎపిసోడ్‌లో ప్రత్యేకంగా ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. దేశ మహోన్నతమైన వ్యక్తుల్లో ఎన్టీఆర్ ఒకరన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో సంచలనం సృష్టించిన మహానాయకుడని, పేదల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. రాముడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, శతపురుషుడిగా తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ నిలిచారని ప్రధాని మోదీ అన్నారు.

Similar News