Renault Duster : కొత్త లుక్.. హైటెక్ ఫీచర్లు.. డస్టర్ ఈజ్ బ్యాక్..ఎస్ఈవీ మార్కెట్లో మళ్లీ ప్రకంపనలే.

Update: 2026-01-19 07:15 GMT

Renault Duster :ఒకప్పుడు ఇండియన్ రోడ్లపై రారాజులా వెలిగిన రెనాల్ట్ డస్టర్ ఇప్పుడు సరికొత్త అవతారంలో మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఎస్ఈవీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2026 మోడల్ డస్టర్ టీజర్‌ను రెనాల్ట్ ఇండియా విడుదల చేసింది. గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26, 2026న ఈ కారును అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. మూడు ఖండాల్లో, మైనస్ డిగ్రీల చలి నుంచి 55 డిగ్రీల మండుటెండల వరకు దాదాపు 10 లక్షల కిలోమీటర్ల మేర కఠినమైన పరీక్షలు పూర్తి చేసుకున్న ఈ కారు, మునుపటి కంటే పవర్‌ఫుల్ గా ఉండబోతోంది.

కొత్త 2026 రెనాల్ట్ డస్టర్ డిజైన్ పరంగా చాలా బోల్డ్ గా కనిపిస్తోంది. CMF-B ప్లాట్‌ఫారమ్ పై రూపొందిన ఈ కారులో వై-షేప్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, స్పోర్టీ బంపర్, కొత్త గ్రిల్ డిజైన్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. 18 ఇంచుల అలాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, వైడ్ సైడ్ క్లాడింగ్ దీనికి ఒక పవర్‌ఫుల్ లుక్ ఇస్తున్నాయి. వెనుక భాగంలో కూడా వై-షేప్ టెయిల్ ల్యాంప్‌లతో కారు వెనుక నుంచి కూడా చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. పాత మోడల్‌తో పోలిస్తే దీని బాడీ లాంగ్వేజ్ మరింత ప్రీమియంగా మారింది.

డస్టర్ ఇంటీరియర్ విషయంలో రెనో ఈసారి రాజీ పడలేదు. ఇందులో 10.1 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సౌకర్యాలు ఉన్నాయి. 7 ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, 6-స్పీకర్ల అర్కామిస్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కారు లోపల ఒక ప్రీమియం ఫీల్ ఇస్తాయి. ముఖ్యంగా సేఫ్టీ కోసం లెవల్ 2 అడాస్ టెక్నాలజీని జోడించడం వల్ల ప్రయాణం మరింత సురక్షితంగా ఉంటుంది. మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, క్రాష్ టెస్ట్ రేటింగ్స్ పై కూడా కంపెనీ ప్రత్యేక దృష్టి పెట్టింది.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, 2026 డస్టర్ రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో రానుంది. ఒకటి 1.3 లీటర్ టర్బో పెట్రోల్ కాగా, మరొకటి 1.2 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్. మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వెర్షన్లలో ఇది అందుబాటులో ఉంటుంది. ఆఫ్-రోడింగ్ ఇష్టపడే వారి కోసం టాప్ ఎండ్ మోడల్స్ లో 4X4 డ్రైవ్ ట్రెయిన్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఐస్ వెర్షన్ లాంచ్ అయిన కొన్ని నెలల తర్వాత దీని స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం. మార్కెట్లోకి వస్తే ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

Tags:    

Similar News