Toyota Fortuner : ఫార్చ్యూనర్ కొత్త విశ్వరూపం..అదిరిపోయే ఫీచర్లతో వస్తున్న మోడీ సర్కార్ ఫేవరెట్ ఎస్‌యూవీ.

Update: 2026-02-24 07:45 GMT

Toyota Fortuner : ఎస్ఓవీ లవర్స్ లో రారాజుగా వెలుగొందుతున్న టయోటా ఫార్చ్యూనర్ సరికొత్త అవతారంలో మెరిసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే థాయిలాండ్‌లో ఈ కొత్త తరం మోడల్ టెస్టింగ్ దశలో ఉండగా, దానికి సంబంధించిన స్పై షాట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 2026 నాటికి మార్కెట్లోకి రానున్న ఈ కొత్త ఫార్చ్యూనర్, కేవలం లుక్ పరంగానే కాకుండా టెక్నాలజీ, పవర్ ట్రైన్ విషయంలోనూ భారీ మార్పులతో రాబోతోంది. ముఖ్యంగా టయోటా తన లేటెస్ట్ హైలక్స్ పిక్ అప్ ట్రక్కులో వాడిన అదే ఆధునిక ప్లాట్‌ఫారమ్‌ను దీని కోసం ఉపయోగిస్తోంది.

డిజైన్ విషయానికి వస్తే.. కొత్త ఫార్చ్యూనర్ మునుపటి కంటే మరింత కరుకుగా, బలంగా కనిపించనుంది. దీని ఫ్రంట్ గ్రిల్ హనీకోంబ్ పాటర్న్‌తో ఉండి, సన్నని ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, స్పోర్టీ బంపర్‌తో ఆకర్షణీయంగా ఉండబోతోంది. వెనుక వైపు కూడా ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు ఒక లైట్ బార్‌తో అనుసంధానించబడి ఉంటాయి. కారు లోపల కంఫర్ట్ కూడా నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోంది. ఇందులో 12.3 ఇంచుల రెండు భారీ స్క్రీన్లు (ఒకటి డ్రైవర్ డిస్ప్లే, మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్) ఉండనున్నాయి. వీటితో పాటు 360-డిగ్రీల కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, మొట్టమొదటిసారిగా అడాస్ (ADAS) వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు కూడా రాబోతున్నాయి.

ఇక ఇంజన్ సామర్థ్యం గురించి మాట్లాడితే, ఈ కొత్త మోడల్ 2.7 లీటర్ పెట్రోల్, 2.8 లీటర్ డీజిల్ ఇంజన్లతో రానుంది. అయితే ఈసారి డీజిల్ ఇంజన్ 48-వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కారు మైలేజీ పెరగడమే కాకుండా, నడపడం కూడా చాలా సులభమవుతుంది. హైడ్రోజన్, ఎలక్ట్రిక్ (BEV) వెర్షన్లపై కూడా టయోటా కసరత్తు చేస్తోంది, కానీ తొలుత హైబ్రిడ్ వెర్షన్లే మార్కెట్లోకి వస్తాయని సమాచారం. మొత్తానికి పాత ఫార్చ్యూనర్ కంటే ఇది మరింత స్మార్ట్‌గా, శక్తివంతంగా ఉండబోతోంది.

Tags:    

Similar News