TVS Apache RTR 160 4V : కాలేజీ కుర్రాళ్ల హాట్ ఫేవరెట్..అదిరిపోయే లుక్, మైలేజ్..రూ.1.16 లక్షలకే స్పోర్ట్స్ బైక్.

Update: 2026-02-24 08:15 GMT

TVS Apache RTR 160 4V : కాలేజీకి వెళ్లే కుర్రాళ్లకు బైక్ అంటే కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, అదొక స్టైల్ స్టేట్‌మెంట్. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే లుక్ ఉండాలి. అదే సమయంలో జేబుకు చిల్లు పడకుండా మంచి మైలేజీ కూడా ఇవ్వాలి. ఇలాంటి కుర్రాళ్ల అభిరుచులకు తగ్గట్టుగా టీవీఎస్ మోటార్స్ నుంచి వచ్చిన క్రేజీ బైక్ TVS Apache RTR 160 4V. 160 సీసీ సెగ్మెంట్లో రారాజుగా వెలుగొందుతున్న ఈ బైక్, తన పర్ఫార్మెన్స్‌తో యువతను కట్టిపడేస్తోంది. స్పోర్టీ డిజైన్, అత్యాధునిక ఫీచర్లు కలిపి కేవలం రూ.1.16 లక్షల ప్రారంభ ధరతో ఇది అందుబాటులో ఉంది.

ఈ బైక్ ధర విషయానికి వస్తే.. బేస్ వేరియంట్ ధర సుమారు రూ.1,15,852 (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. మీరు అన్ని హంగులు ఉన్న టాప్ ఎండ్ మోడల్‌ను ఎంచుకుంటే అది రూ.1,37,440 వరకు వెళ్తుంది. అయితే ఆన్-రోడ్ ధరలు మీరు ఉండే నగరాన్ని బట్టి మారుతుంటాయి. మార్కెట్లో దీనికి గట్టి పోటీ ఇచ్చే బజాజ్ పల్సర్ N160, హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V వంటి బైక్‌ల కంటే కూడా అపాచీ తనదైన ముద్ర వేసుకుంది. ముఖ్యంగా ఈ బైక్‌లో ఇచ్చే కలర్ ఆప్షన్లు రోడ్డుపై వెళ్తుంటే అందరి దృష్టిని ఆకర్షిస్తాయి.

ఇక మైలేజీ విషయానికి వస్తే.. పెట్రోల్ ధరలు మండుతున్న ఈ రోజుల్లో ఇది ఒక వరం అని చెప్పాలి. ఈ బైక్‌లో 159.7 సీసీ ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది సిటీ ట్రాఫిక్‌లో లీటరుకు సుమారు 47.61 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అదే మీరు హైవేపై వెళ్తే ఏకంగా 49.80 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇందులో ఉండే 12 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఒకసారి ఫుల్ చేస్తే సుమారు 570 కిలోమీటర్ల వరకు ఆగకుండా ప్రయాణించవచ్చు. వేగం విషయంలోనూ తగ్గేదేలే అంటున్న ఈ బైక్, గంటకు 114 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదు.

ఫీచర్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, స్లిప్పర్ క్లచ్ వంటివి ఇచ్చారు. ట్రాఫిక్‌లో బైక్ ఆగకుండా మెల్లగా వెళ్లడానికి ఉపయోగపడే గ్లైడ్ త్రూ టెక్నాలజీ ఈ బైక్ ప్రత్యేకం. అదనంగా కొత్తగా వచ్చిన యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్స్ వేరియంట్ వల్ల బైక్ కంట్రోల్ చేయడం, మలుపుల వద్ద బ్యాలెన్స్ చేయడం చాలా సులభమవుతుంది. అందుకే లుక్, మైలేజ్, పర్ఫార్మెన్స్ అన్నీ కావాలనుకునే స్టూడెంట్స్ కి ఇది బెస్ట్ ఛాయిస్.

Tags:    

Similar News