Premium Bikes : 2026లో రోడ్లపై పవర్ పాలిటిక్స్.. రాబోతున్న 3 అదిరిపోయే ప్రీమియం బైక్స్.

Update: 2025-12-26 16:15 GMT

Premium Bikes : భారతదేశంలో ప్రీమియం బైక్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం ప్రయాణం కోసమే కాకుండా ఒక లైఫ్ స్టైల్ స్టేటస్‌గా బైక్స్‌ను చూసే యువత సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అందుకే దిగ్గజ కంపెనీలు తమ పవర్ ఫుల్ మెషీన్లను ఇండియాలో దించేందుకు సిద్ధమయ్యాయి. వచ్చే 2026 సంవత్సరం బైక్ లవర్స్‌కు నిజంగానే ఒక పండగలా ఉండబోతోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి నార్టన్ వరకు.. అదిరిపోయే ఫీచర్లతో మూడు క్రేజీ బైక్స్ మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి.

1. BMW F 450 GS: బీఎమ్‌డబ్ల్యూ నుంచి వస్తున్న ఈ ఎంట్రీ-లెవల్ అడ్వెంచర్ బైక్ కోసం రైడర్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. చెన్నై సమీపంలోని టీవీఎస్ ప్లాంట్‌లో తయారవుతున్న ఈ బైక్‌లో 420cc ప్యారలల్-ట్విన్ ఇంజిన్ ఉంటుంది. దీని లుక్ విషయానికి వస్తే.. షార్ప్ డిజైన్,స్టైలిష్ ఎక్స్ షేప్ క్వాడ్-LED DRLలతో చూడగానే కట్టేపడేలా ఉంటుంది. లాంగ్ రైడ్స్ వెళ్లే వారికి, ఆఫ్-రోడింగ్ ఇష్టపడే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.

2. రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 650: బుల్లెట్ అంటేనే ఒక ఎమోషన్. ఇప్పటివరకు మనం 350 cc బుల్లెట్‌ను చూశాం, కానీ ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ దాని పెద్దన్నను మార్కెట్లోకి తెస్తోంది. అదే బుల్లెట్ 650. ఇంటర్సెప్టర్, కాంటినెంటల్ జీటీలలో ఉండే 648 cc ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌ను ఇందులో వాడుతున్నారు. పాత క్లాసిక్ లుక్‌ను అలాగే ఉంచుతూ, మరింత భారీ రోడ్ ప్రెజెన్స్‌తో ఈ బైక్ రాబోతోంది. బుల్లెట్ శబ్దాన్ని ప్రేమించే వారికి ఇది నెక్స్ట్ లెవల్ కిక్కు ఇవ్వడం ఖాయం.

3. నార్టన్ Atlas: బ్రిటన్ దిగ్గజం నార్టన్ ఇప్పుడు మన దేశీ దిగ్గజం టీవీఎస్ మోటార్స్ చేతుల్లోకి వచ్చింది. 2026 జూన్ లేదా జూలై నాటికి నార్టన్ తన అట్లాస్ అడ్వెంచర్ బైక్‌ను ఇండియాలో లాంచ్ చేయనుంది. ఇందులో 585cc ఇంజిన్ ఉండబోతోంది. ఇది సుమారు 50 bhp పవర్, 55 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. క్విక్ షిఫ్టర్ వంటి మోడ్రన్ ఫీచర్లతో రాబోతున్న ఈ బైక్, ప్రీమియం సెగ్మెంట్లో గట్టి పోటీని ఇచ్చేలా కనిపిస్తోంది.

మొత్తానికి 2026లో ఈ మూడు బైక్స్ భారత రోడ్లపై తమ సత్తా చాటనున్నాయి. బడ్జెట్, పవర్‌ను బట్టి రైడర్స్ తమకు నచ్చిన మెషీన్‌ను ఎంచుకోవచ్చు. స్పీడ్ కంటే స్టైల్, కంఫర్ట్ కోరుకునే వారికి ఈ మూడు బైక్స్ బెస్ట్ ఆప్షన్లు కానున్నాయి.

Tags:    

Similar News