BUSINESS: 2024లో 43 లక్షల కార్ల విక్రయాలు

Update: 2025-04-17 05:00 GMT

2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా రికార్డు స్థాయిలో కార్లు విక్రయాలు జరిగాయి. దేశవ్యాప్తంగా 43,01,848 ప్రయాణికుల వాహనాలు (ప్యాసింజర్ వెహికల్స్- కార్లు, ఎస్‌యూవీలు/ఎంపీవీలు, వ్యాన్లు) టోకుగా విక్రయమయ్యాయి. 2023-24లో కంపెనీల నుంచి డీలర్లకు సరఫరా అయిన 42,18,750 ప్యాసింజర్ వెహికల్స్‌తో పోలిస్తే, ఈ సంఖ్య 2% అధికమని దేశీయ వాహన తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. 2024-25లో విక్రయమైన పీవీల్లో బహుళ వినియోగ వాహనాలే (ఎంపీవీ) 65% ఉన్నాయని తెలిపింది. 2023-24లో వీటి వాటా 60% కాగా, ఈసారి మరింత పెరిగింది. ప్యాసింజన్ వాహనాల ఎగుమతులు కూడా 15% అధికమై 7.7 లక్షలకు చేరాయి. మరోవైపు గ్రామీణ గిరాకీ మెరుగుపడటం వల్ల ద్విచక్ర వాహన అమ్మకాలు పెరిగాయి. ద్విచక్ర వాహన ఎగుమతుల్లో 21% వృద్ధి నమోదైంది.

సంతృప్తికర నమోదు

2024 మార్చి నెల అమ్మకాలతో పోలిస్తే, ఈ ఏడాది మార్చిలో ప్యాసింజర్ వెహికల్ సరఫరాలు 4% అధికమై 3,81,358కి చేరాయి. ద్విచక్ర వాహనాలు 11% ఎక్కువగా 16,56,939కి చేరగా.. ఆటోలు 10% పెరిగి 62,813గా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలోనూ దేశంలో వాహనాలకు గిరాకీ సంతృప్తికరంగా నమోదైంది. ప్రభుత్వ విధానాలు సహకరించడం, మౌలిక సదుపాయాల కల్పనకు వ్యయాలు పెంచడం, పర్యావరణ అనుకూల రవాణాకు ప్రాధాన్యం పెరగడం ఇందుకు ఉపకరించింది. పీవీలు, త్రిచక్ర వాహన విక్రయాలు 2023-24లోనూ ఎక్కువగా విక్రయం కావడం వల్ల, 2024-25 వృద్ధి తక్కువగా కనపడుతోంది. ఈ 2 విభాగాల్లో రికార్డుస్థాయి అమ్మకాలు జరిగాయి.

Tags:    

Similar News