ఆర్టీఐ చెలామణి నుంచి తొలగించిన 2000 రూపాయల నోట్లు 97.92 శాతం బ్యాంక్ల్ వద్దకు తిరిగి వచ్చాయి. ఇంకా ప్రజల వద్దే 7,409 కోట్లు ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. 2023, మే 19న ఆర్ బీఐ 2 వేల నోట్లను చెలామణి నుంచి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఆర్టీఐ ప్రకటించే సమయానికి చెలామణిలో 2 వేల రూపాయల నోట్ల విలువ 3.56 లక్షల కోట్లుగా ఉన్నాయి. జులై 31 నాటికి 7,409 కోట్ల రూపాయల విలువైన 2వేల రూపాయల నోట్లు ఇంకా బ్యాంక్ లకు తిరిగి రావాల్సి ఉంది. ఇప్పటి వరకు మొత్తం నోట్లలో 97.92 శాతం చెలామణి నుంచి తిరిగి వచ్చాయని ఆర్బీఐ పేర్కొంది.
2028, అక్టోబర్ 7 వరకు దేశంలోని అన్ని బ్యాంకుల బ్రాంచ్ ల్లోనూ 2 వేల రూపాయలను మార్చుకునేందుకు, అకౌంట్లలో డిపాజిట్ చేసేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఈ నోట్లను దేశవ్యాప్తంగా ఉన్న 19 అర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే మార్చు కునేందుకు అవకాశం ఉంది. స్వయంగా రాకున్నా ఈ కేంద్రాలకు పోస్ట్ ద్వారా నోట్లను పంపించుకోవచ్చు. వీటిని ఆయా ఖాతాల్లో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు జమ చేస్తాయి.