RBI : రూ.2వేల నోట్లు 97.87% వెనక్కి వచ్చాయ్: ఆర్బీఐ

Update: 2024-07-02 05:02 GMT

కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ.2000 నోట్లలో 97.87శాతం వరకు బ్యాకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. 2024 జూన్ 28 నాటికి రూ.7851 కోట్ల విలువైన నోట్లు మాత్రం ప్రజల వద్దే ఉండిపోయాయంది. కాగా 2016 నవంబరులో ఈ నోట్లను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. 2023 మే 19న రూ.2వేల నోట్లను కేంద్రం ఉపసంహరించుకుంది.

మే 19, 2023 రోజున రూ. 2 వేల కరెన్సీ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటన చేసే నాటికి చలామణిలో రూ. 3.56 లక్షల కోట్లు విలువైన రూ. 2 వేల నోట్లు ఉన్నాయి. ఆ తర్వాత అక్టోంబర్ , 2023 వరకు బ్యాంకుల్లో మార్చుకోవడం, డిపాజిట్లు చేసేందుకు అవకాశం కల్పించింది.

ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చేందుకు వీలు కల్పించింది. నేరుగా వెళ్లలేని వారు పోస్టాఫీసు ద్వారా నోట్లు పంపిస్తే వారి ఖాతాల్లో జమ చేస్తోంది. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా మరియు తిరువనంతపురంలో 19 ఆర్‌బిఐ కార్యాలయాలు ఉన్నాయి.

Tags:    

Similar News