Adani Group : రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో అదానీ గ్రూప్ రూ.4లక్షల కోట్లు ఇన్వెస్ట్
నాలుగవ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్‌పో(రీ-ఇన్వెస్ట్) 2024లో అదానీ గ్రూప్.. సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్ లాంటి రెన్యూవబుల్ ఇంధన ప్రాజెక్టులపై రూ.4,05,800 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, దాని ప్రస్తుత 11.2 గిగావాట్ల నుంచి 2030 నాటికి 50 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదానీ న్యూ ఇండస్ట్రీస్..10 గిగావాట్ల సోలార్ తయారీ ప్లాంట్, 5 గిగావాట్ల పవన విద్యుత్ తయారీ, 10 గిగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ అవుట్‌పుట్, 5 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ ఉత్పత్తి తయారీని ఏర్పాటు చేస్తుంది. అదానీ గ్రూప్ ఇంధన ప్రాజెక్టులపై చేసే రూ.4,05,800 కోట్ల పెట్టుబడితో సుమారు 71,100 మందికి ఉపాధి కల్పన అవకాశం ఉంటుంది.