Amazon : దీపావళి షాపింగ్‌కు రెడీనా.. అమెజాన్ తెచ్చేసింది.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్.
Amazon : పండుగల సీజన్ మొదలవ్వడంతో అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 దీపావళి స్పెషల్ సేల్ లైవ్ అయింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, వేలాది ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. కస్టమర్‌ల కోసం ఈసారి ఒక లక్షకు పైగా ఉత్పత్తులపై తగ్గింపు, 30,000 పైగా కొత్త ఉత్పత్తులను లాంచ్ చేశారు. స్మార్ట్‌ఫోన్ల నుంచి ఫ్యాషన్, హోమ్ డెకార్, గిఫ్టింగ్ వంటి ప్రతి విభాగంలోనూ బ్లాక్‌బస్టర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రానిక్స్ స్పెషల్ ఆఫర్లు ఈ దీపావళి సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్ పై అతి తక్కువ ధరలు ఉన్నాయి. శామ్‌సంగ్, ఆపిల్, వన్‌ప్లస్, iQOO వంటి టాప్ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. ముఖ్యంగా గెలాక్సీ S24 Ultra, ఐఫోన్ 15, వన్ ప్లస్ 13R మోడల్స్‌పై బెస్ట్ డీల్స్ ఉన్నాయి. వీటితో పాటు షియోమీ QLED TV, లెనోవో ల్యాప్‌టాప్‌లు, సోనీ హెడ్‌ఫోన్స్ వంటి ప్రీమియం ఎలక్ట్రానిక్ వస్తువులపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి.
స్కూటర్లు, ఫ్యాషన్‌పై తగ్గింపు పండుగల సందర్భంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లపై కూడా అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. ఏథర్ రిజ్తా ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్, హీరో ఎక్స్ ట్రీమ్ 125ఆర్ ఏబీఎస్ బైక్ వంటి వాటికి దీపావళి స్పెషల్ ధరలు పెట్టారు. ఇక ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులపై ఏకంగా 80% వరకు తగ్గింపు లభిస్తోంది. ముఖ్యంగా, ఎథ్నిక్ వేర్, చెప్పులు, మేకప్, పర్‌ఫ్యూమ్స్‌పై 40% నుంచి 70% వరకు తగ్గింపులు ఉన్నాయి. బడ్జెట్ షాపింగ్ చేయాలనుకునే వారి కోసం, అమెజాన్ బజార్‌లో ఉత్పత్తులు కేవలం రూ.49 నుంచే మొదలవుతున్నాయి.
బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ వివరాలు
కస్టమర్‌లు ఈ సేల్‌లో బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, జీఎస్టీ సేవింగ్స్ కూడా పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్, ఆర్బీఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, IDFC క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగించి కొనుగోలు చేస్తే ఈఎంఐ లావాదేవీలతో సహా 10% ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడితే 5% క్యాష్‌బ్యాక్ వస్తుంది. రివార్డ్స్ గోల్డ్ ప్రోగ్రామ్ కింద 15కు పైగా విభాగాలలో అదనంగా 5% క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.