Amazon: పండగ సీజన్ టార్గెట్.. ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్న అమెజాన్
ఈ ఏడాది కూడా దసరా, దీపావళి పండుగలపైనే ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వినియోగ వస్తూత్పత్తి పరిశ్రమ టార్గెట్ చేస్తోంది.;
Amazon: పండగ సీజన్ వచ్చేస్తోందంటే చాలు.. ఆఫర్లతో కంపెనీలన్నీ సిద్ధమైపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వినియోగ వస్తువులకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది. ఈ ఏడాది కూడా దసరా, దీపావళి పండుగలపైనే ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వినియోగ వస్తూత్పత్తి పరిశ్రమ టార్గెట్ చేస్తోంది. ఆశ్చర్యకరంగా ఈ పరిశ్రమ వార్షిక టర్నోవర్‌లో దాదాపు 30 శాతం ఈ పండగల సీజన్‌లోనే ఉంటుంది. ఇక గత ఏడాది అమ్మకాలను దారుణంగా కొవిడ్ దెబ్బతీసింది.
ఈ సారి కూడా సెకండ్ వేవ్ రూపంలో అమ్మకాలకు గండి కొట్టింది. ఇక ఈ లోటును పూడ్చుకోవాలంటే పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకోవాల్సిందేనన్న నిర్ణయానికి పరిశ్రమలన్నీ వచ్చినట్టున్నాయి. అందుకే పండుగ ఆఫర్లతో సిద్ధమవుతున్నాయి. ఈ సారి రెండంకెల వృద్ధి ఉంటుందనే నిర్ణయానికి వచ్చేశాయి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్స్, లాప్‌ట్యాప్, మొబైల్‌కు చెందిన సంస్థలు పండగ సీజన్‌పై భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఈ క్రమంలోనే డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా, నిల్వలను సిద్ధం చేస్తున్నాయి.
పాత మోడల్స్‌ను పక్కనబెట్టి లేటెస్ట్ మోడల్స్‌కు మారిపోయేవారున్నారు. వారందరినీ సంస్థలు టార్గెట్ చేస్తున్నాయి. నయా మోడల్స్, ఆకర్షణీయమైన డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్‌లతో వినియోగదారులకు కంపెనీలు వలవేస్తున్నాయి. పానాసోనిక్ ఇండియా కంపెనీ అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే గత నెలలో (ఆగస్టు) 25 శాతం పెరిగాయి. ఇక పండుగ సీజన్‌లో మరింత పెరిగే అవకాశముందని కంపెనీలు భావిస్తున్నాయి.
పండగ సీజన్ టార్గెట్..ఈ క్రమంలోనే ఈ సంవత్సరం పండగల సీజన్‌లో అమ్మకాల వృద్ధి రేటు తక్కువలో తక్కువ రెండంకెల్లో ఉంటుందని భావిస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఇప్పటికే బంపర్ ఆఫర్‌లతో సిద్ధమైపోయాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై 30 శాతం, ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం వరకు ఆఫర్లను ప్రకటించనున్నట్టు సమాచారం. ఫ్యాషన్‌పై సుమారు 40 శాతం నుంచి 80 శాతం మేర ఆఫర్లను అందించనున్నట్లు తెలుస్తోంది. మరో బంపర్ ఆఫర్ ఏంటంటే.. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలుపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను అందించనుంది. అలాగే ఫ్యాషన్ ఉత్పత్తుల కొనుగోలు అదనంగా రూ.300 క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది.