iPhone 16 : ఐఫోన్ 16 ఫోన్ల అమ్మకాలు ప్రారంభం

Update: 2024-09-21 08:00 GMT

గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థ అపిల్ తన ఐ ఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయాలు శుక్రవారం (సెప్టెంబర్20) నుండి ప్రారంభమయ్యాయి. దీంతో కొనుగోలుదారులు యాపిల్‌ స్టోర్‌ల ముందు క్యూ కట్టారు. దేశ వ్యాప్తంగా ఐ ఫోన్ 16 మొబైల్ అమ్మకాలు ప్రారంభమయ్యాయని ఆపిల్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. అయితే, భారత్ మార్కెట్‌లో ఐ ఫోన్ ప్రో సిరీస్ ఫోన్ల లభ్యతపై మాత్రం ఆపిల్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. దేశంలో ఐ ఫోన్ ప్రో సిరీస్ ఫోన్లను తొలిసారి అసెంబ్లింగ్ చేస్తున్నా వాటి అమ్మకాల తేదీ త్వరలో ప్రకటిస్తామని అపిల్ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో స్మార్ట్ ఫోన్లపై దిగుమతి సుంకం తగ్గించిన నేపథ్యంలో గత వర్షన్ ఐ ఫోన్ల కంటే ఐ ఫోన్ 16 సిరీస్ మొబైల్ ధరలు తగ్గనున్నాయి. ఐ ఫోన్ 16 ప్రో మొబైల్ ధర రూ.1,19,900లు, ఐ ఫోన్ 16 ప్రో మ్యాక్స్ మొబైల్ ధర రూ.1,44,900 నుండి ప్రారంభం అవుతుందని ఆపిల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఐ ఫోన్ 16 మొబైల్, ఐ ఫోన్ 16 ప్లస్ ధరల్లో ఎటువంటి మార్పు లేదని ఆపిల్ తెలిపింది. ఐ ఫోన్ 16 మొబైల్ ను రూ.79,900లు, ఐ ఫోన్ 16 ప్లస్ మొబైల్ ను రూ.89,900లకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

Tags:    

Similar News