Bajaj Chetak C25 : రూ.30 వేలు కడితే చాలు..మీ ఇంటికి బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్.

Update: 2026-01-21 06:45 GMT

Bajaj Chetak C25 : బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ సిరీస్‌లో అత్యంత సరసమైన మోడల్ చేతక్ C25 ను లాంచ్ చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.91,399. మార్కెట్లో ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎన్ని ఉన్నా, బజాజ్ ఇచ్చే బిల్డ్ క్వాలిటీ మరియు నమ్మకం ఈ మోడల్ సొంతం. ఈ స్కూటర్ ద్వారా ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో తన వాటాను భారీగా పెంచుకోవాలని బజాజ్ ప్లాన్ చేస్తోంది. నగర ప్రయాణాలకు, ఆఫీసులకు వెళ్లేవారికి ఇది ఒక ప్రాక్టికల్ ఎంపికగా మారుతోంది.

రేంజ్, స్పీడ్: బజాజ్ చేతక్ C25 పనితీరు విషయానికి వస్తే ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 113 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. దీనివల్ల రోజువారీ అవసరాలకు ఛార్జింగ్ టెన్షన్ లేకుండా తిరగొచ్చు. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 55 కిలోమీటర్లు. ఇది సిటీ ట్రాఫిక్‌లో సురక్షితంగా, వేగంగా ప్రయాణించడానికి సరిపోతుంది. బజాజ్ చేతక్ తన మెటల్ బాడీ, స్టైలిష్ లుక్స్‌తో ఇప్పటికే కస్టమర్ల మనసు గెలుచుకుంది. ఇప్పుడు ఈ తక్కువ ధర మోడల్‌తో మరింత మందికి దగ్గరవుతోంది.

ఈఎంఐ ప్లాన్ వివరాలు : మీరు ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, బజాజ్ ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆప్షన్లను అందిస్తోంది. మీరు రూ.30,000 డౌన్ పేమెంట్ చెల్లిస్తే, మిగిలిన రూ.61,399 లోన్ మొత్తంగా మారుతుంది. దీనిపై వడ్డీ రేటు 7.5% నుంచి 8% వరకు ఉండవచ్చు. మీరు ఒక ఏడాది (12 నెలలు) లోన్ పెట్టుకుంటే, నెలకు సుమారు రూ.5,327 ఈఎంఐ పడుతుంది. అదే రెండు ఏళ్ల (24 నెలలు) కాలపరిమితి ఎంచుకుంటే, ఈఎంఐ భారం తగ్గి నెలకు కేవలం రూ.2,763 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.

ఈ స్కూటర్ ద్వారా ఓలా, టీవీఎస్ వంటి కంపెనీల బడ్జెట్ ఈవీలకు గట్టి పోటీ ఇవ్వాలని బజాజ్ చూస్తోంది. తక్కువ ధర, నమ్మకమైన సర్వీస్ నెట్‌వర్క్, ఈజీ ఈఎంఐలు ఉండటంతో చేతక్ C25 అమ్మకాల్లో దూసుకుపోయే అవకాశం ఉంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఇతర మోడళ్ల కంటే ఇందులో ఫీచర్లు కొన్ని తక్కువగా అనిపించినా, మన్నిక విషయంలో బజాజ్ ఎప్పుడూ ముందుంటుంది.

Tags:    

Similar News