Jio : జియోకు కస్టమర్లు భారీ షాక్.. !
Jio : రిలయన్స్జియోకు కస్టమర్స్‌లు షాక్ ఇచ్చారు. సుమారు కోటి 29లక్షల మంది జియోను వీడారు.;
Jio : రిలయన్స్జియోకు కస్టమర్స్‌లు షాక్ ఇచ్చారు. సుమారు కోటి 29లక్షల మంది జియోను వీడారు. అటు.. అనూహ్యంగా బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్సను భారీ స్థాయిలో పెంచుకుంది. ఈ మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ డిసెంబర్ నెల గణాంకాలను రిలీజ్ చేసింది.
డిసెంబర్ నెలతో పోల్చితే భారత్లో మొబైల్ చందాదారుల సంఖ్య భారీగా తగ్గింది. సుమారు కోటి 28 లక్షల మంది వినియోగదారులను టెలికాం సంస్థలు కోల్పోయినట్లు ట్రాయ్ వెల్లడించింది. ఎక్కువ మంది చందాదారులు రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాను వీడినట్లు పేర్కొంది.
మరోవైపు భారతీ ఎయిర్టెల్ తన వినియోదారుల సంఖ్యను పెంచుకున్నట్లు తెలిపింది. ట్రాయ్ గణాకాల ప్రకారం రిలయన్స్ జియో సుమారు 1.29 కోట్ల మంది కస్టమర్లను కోల్పోయింది. ప్రస్తుతం మొత్తం జియో చందాదారుల సంఖ్య 41.57 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది ట్రాయ్.
మరోవైపు వొడాఫోన్ ఐడియాను 16.14 లక్షల మంది వీడారు. ఇక... బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం క్రమంగా తన కస్టమర్ల సంఖ్యను 11 లక్షల వరకు పెంచుకున్నట్లు ట్రాయ్ తెలిపింది.