Best Mileage SUVs : క్రెటా, సెల్టోస్, ఎక్స్‌యూవీ.. బడ్జెట్ ధరలో బెస్ట్ మైలేజీ కార్లు.

Update: 2026-03-12 09:15 GMT

Best Mileage SUVs : మధ్యతరగతి వాహనదారులకు మైలేజీ అనేది ప్రాణవాయువు లాంటిది. ఒక్క లీటరు పెట్రోల్‌కు కారు ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందనే దానిపైనే చాలామంది తమ కొనుగోలు నిర్ణయాన్ని తీసుకుంటారు. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం, ఎస్‌యూవీ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. మరి మార్కెట్లో టాప్ గేర్‌లో ఉన్న టాటా, మారుతి, కియా, హ్యుందాయ్, మహీంద్రా కార్లలో ఏది ఎక్కువ మైలేజీ ఇస్తుంది? వేటి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మారుతి సుజుకి విక్టోరిస్

మైలేజీ గురించి మాట్లాడితే మారుతి సుజుకి తర్వాతే ఎవరైనా. ఈ కొత్త విక్టోరిస్ మోడల్ మైలేజీలో రికార్డులు సృష్టిస్తోంది. దీని ప్రారంభ ధర రూ.10,49,900 (ఎక్స్-షోరూమ్). ఇది లీటరు పెట్రోల్‌కు 21.18 కి.మీ నుంచి ఏకంగా 28.65 కి.మీ వరకు మైలేజీ ఇస్తుందని సమాచారం. అంటే లాంగ్ జర్నీలకు వెళ్లేవారికి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్. హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల ఇది సాధ్యమవుతోంది.

టాటా సియెర్రా

స్టైలిష్ లుక్, గట్టి బాడీకి కేరాఫ్ అడ్రస్ టాటా సియెర్రా. దీని ప్రారంభ ధర రూ.11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). మైలేజీ విషయానికి వస్తే, ఇది లీటరుకు 15.5 నుంచి 17 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. పవర్ఫుల్ ఇంజిన్, భారీ నిర్మాణం ఉన్నప్పటికీ, ఇది మంచి మైలేజీనే అందిస్తోంది. ముఖ్యంగా సేఫ్టీని కోరుకునే వారికి ఇది మొదటి ప్రాధాన్యత.

కొత్త కియా సెల్టోస్

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ప్రస్తుతం యువతను బాగా ఆకర్షిస్తోంది. దీని ప్రారంభ ధర రూ.10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు లీటరుకు 17 కి.మీ నుంచి 20.7 కి.మీ వరకు మైలేజీ ఇస్తుంది. అధునాతన ఇంటీరియర్, అదిరిపోయే ఫీచర్లతో పాటు మంచి రాబడిని ఇచ్చే కారు ఇది.

హ్యుందాయ్ క్రెటా

భారతీయ రోడ్లపై ఎస్‌యూవీ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు క్రెటా. దీని ధర రూ.10.79 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. క్రెటా లీటరుకు 17.4 కి.మీ నుంచి 21.8 కి.మీ వరకు మైలేజీ ఇస్తుంది. హ్యుందాయ్ వారి సర్వీస్ నెట్‌వర్క్, కంఫర్ట్ దీనికి అదనపు బలాన్ని ఇస్తాయి.

మహీంద్రా XUV 7XO

మహీంద్రా నుంచి వచ్చిన పాపులర్ మోడల్ XUV 7XO. దీని ప్రారంభ ధర రూ.13.66 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది లీటరుకు 15 కి.మీ నుంచి 17 కి.మీ మైలేజీని అందిస్తుంది. లగ్జరీ ఫీచర్లు, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఈ కారు బెస్ట్ ఛాయిస్. అయితే ధర కొంచెం ఎక్కువే అయినా, ఆ రేంజ్ సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.

Tags:    

Similar News