China Products Ban: ఇకపై నో 'మేడ్ ఇన్ చైనా'.. దీంతో ఆ దేశానికి 50 వేల కోట్లు..

China Products Ban: ‘మేడ్ ఇన్ చైనా’.. దీని డామినేషన్ చాలా సంవత్సరాలుగా వాణిజ్య రంగంలో కనిపిస్తూనే ఉంది.

Update: 2021-10-30 13:15 GMT

made in china (tv5news.in)

China Products Ban: 'మేడ్ ఇన్ చైనా'.. దీని డామినేషన్ చాలా సంవత్సరాలుగా వాణిజ్య రంగంలో కనిపిస్తూనే ఉంది. ఒకప్పుడు ఏ చిన్న వస్తువు చూసినా దానిపై మేడ్ ఇన్ చైనా స్టిక్కర్ తప్పకుండా కనిపించేది. కానీ గతకొంతకాలంగా దీనిని మార్చాలని ఇండియా చాలా ప్రయత్నాలే చేస్తోంది. ముఖ్యంగా కరోనా పుట్టుక చైనాలోని జరిగింది అన్న ఆరోపణలు మొదలయిన తర్వాత చైనా.. ఇండియాకు మాత్రమే కాదు యావత్ ప్రపంచానికి శత్రుదేశంగా మారిపోయింది. అందుకే దానిని దెబ్బకొట్టే ప్రయత్నాలు మొదలయిపోయాయి.

దీపావళి వచ్చిందంటే ఇండియాలో కాల్చే దాదాపు చాలావరకు టపాసులు చైనా నుండి దిగుమతి కావాల్సిందే. కానీ ఈసారి అలా జరగకూడదని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ( సీఏఐటీ) నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం చైనా నుండి ఒక్క క్రాకర్ కూడా దిగుమతి కాకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ బాయ్‌కాట్ వల్ల చైనాకు సుమారు 50 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందట.

కోవిడ్ తర్వాత చైనా ప్రొడక్ట్స్‌పై ప్రజలు అంతగా ఆసక్తి చూపించట్లేదు. దీని వల్ల అక్కడి ప్రొడక్ట్స్‌కు డిమాండ్ తగ్గిపోవడమే కాకుండా ఇక్కడి ప్రొడక్ట్స్‌కు డిమాండ్ పెరిగింది కూడా. అందుకే దీపావళి సరుకుల కోసం చైనాకు ఇండియాలోని ప్రధాన నగరాల నుండి ఆర్డర్లు కూడా వెళ్లలేదని సీఏఐటీ ప్రకటించింది.

ప్రజలు దేశీ వస్తువులనే కొనడానికి మొగ్గుచూపుతుండడంతో ఇండియన్ బిజినెస్ లాభాల బాట పట్టనుంది. భారత ఆర్థిక వ్యవస్థకి రూ. 2 లక్షల కోట్ల ఇన్‌ఫ్లో రానుంది. గత సంవత్సరం కూడా చైనీస్ ప్రొడక్ట్స్‌ను బాయ్‌కాట్ చేయడం వల్ల ఇండియన్ బిజినెస్‌కు మంచే జరిగింది. ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుందని సీఏఐటీ అంచనా వేస్తోంది. ఈ పరిణామాలన్నీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆత్మ నిర్భర్ యోజనకు శుభసూచకంగా కనిపిస్తున్నాయి. 

Tags:    

Similar News