Citroen : ఈ కారులో వెళ్తుంటే సేఫ్టీ గ్యారెంటీ.. ఇండియాలో లాంచ్ అయిన సిట్రోయెన్ ఎయిర్ క్రాస్ ఎక్స్.

Update: 2025-10-04 11:45 GMT

Citroen : ఫ్రెంచ్ ఆటో కంపెనీ సిట్రోయెన్ భారతదేశంలో తన కొత్త ఎస్‌యూవీ ఎయిర్‌క్రాస్ ఎక్స్‎ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.8.29లు(ఎక్స్-షోరూమ్). కంపెనీ సిట్రోయెన్ 2.0 షిఫ్ట్ ఇన్‌టు ది న్యూ వ్యూహంలో భాగంగా రిలీజ్ చేసిన మూడవ కారు ఇది. అంతకు ముందు కంపెనీ భారత మార్కెట్లో సీ3ఎక్స్, బసాల్ట్ ఎక్స్‎లను ప్రవేశపెట్టింది. కొత్త ఎక్స్ వేరియంట్‌లో ముఖ్యంగా ఇంటీరియర్, ఫీచర్లలో పెద్ద మార్పులు చేశారు. తద్వారా కస్టమర్‌లను మరింత ఆకర్షించవచ్చు.

ఎక్సటీరియర్ డిజైన్‌లో తక్కువ మార్పులు చేశారు. ఇందులో ఒక కొత్త డీప్ ఫారెస్ట్ గ్రీన్ కలర్, టెయిల్‌గేట్‌పై ఎయిర్‌క్రాస్‌తో పాటు ఎక్స్ బ్యాడ్జింగ్ మాత్రమే జోడించారు. కానీ లోపల చూస్తే పెద్ద మార్పులు కనిపిస్తాయి. ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, డోర్ ప్యానెల్‌పై ఇప్పుడు సాఫ్ట్-టచ్ లెదరెట్ ర్యాపింగ్ ఇచ్చారు. టెక్నాలజీ విభాగంలో కంపెనీ పెద్ద అప్‌గ్రేడ్ చేస్తూ 10.25-అంగుళాల బెజిల్-లెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను జోడించింది. దీనితో పాటు అనేక చోట్ల గోల్డ్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు.

కొత్త సిట్రోయెన్ ఎయిర్ క్రాస్ ఎక్స్ ఇంటీరియర్‌ను మరింత ప్రీమియంగా మార్చడానికి అనేక కొత్త ఫీచర్లను జోడించారు. ఇందులో కొత్త గేర్ లీవర్, వెంటిలేటెడ్ లెదరెట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, ఫుట్‌వెల్ లైటింగ్ ఉన్నాయి. దీనితో పాటు దీని ఇంటీరియర్ థీమ్ డీప్ బ్రౌన్‎లో ఉంచారు. ఇది కారుకు ప్రీమియం, అప్‌మార్కెట్ లుక్ ఇస్తుంది.

ఫీచర్ల జాబితా విషయానికి వస్తే ఇప్పుడు ఈ ఎస్‌యూవీలో పాసివ్ ఎంట్రీ, పుష్ స్టార్ట్ బటన్, క్రూజ్ కంట్రోల్, స్పీడ్ లిమిటర్, ఆటో-డిమ్మింగ్ IRVM, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్, శాటిలైట్ వ్యూతో కూడిన 360-డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి. దీనితో పాటు కంపెనీ స్మార్ట్ అసిస్టెంట్ CARA AI ని కూడా జోడించారు, ఇది గతంలో బసాల్ట్ ఎక్స్‌లో ప్రవేశపెట్టబడింది.

సేఫ్టీ విషయంలో ఎయిర్ క్రాస్ ఎక్స్‎కు BNCAP నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఇందులో హై-స్ట్రెంత్ బాడీ స్ట్రక్చర్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ, హిల్ హోల్డ్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మొత్తంమీద ఇందులో 40కి పైగా యాక్టివ్, పాసివ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

ఎయిర్ క్రాస్ ఎక్స్ పవర్‌ట్రైన్ స్టాండర్డ్ వేరియంట్ మాదిరిగానే ఉంది. బేస్ మోడల్‌లో 82hp, 1.2-లీటర్, 3-సిలిండర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ లభిస్తుంది, ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. దీని హైయర్ ట్రిమ్స్‌లో 110hp, 1.2-లీటర్, 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు, దీనిని 6-స్పీడ్ మాన్యువ, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రెండింటితో కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు కంపెనీ సీఎన్‌జీ ఫిట్‌మెంట్ ఆప్షన్‌ను కూడా అందించింది. దీనిని ఆఫ్టర్‌మార్కెట్ ద్వారా అమర్చుకోవచ్చు.

Tags:    

Similar News