టాప్ 30 టైర్- 2 నగరాల హౌసింగ్ నివేదికను డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్‌ఈక్విటీ సోమవారం విడుదల చేసింది. ప్రాప్‌ఈక్విటీ నివేదిక ప్రకారం అధిక బేస్ ఎఫెక్ట్, సరఫరాలో తగ్గుదల కారణంగా 2024, జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో టాప్30 టైర్- 2 నగరాల్లో ఇళ్ల విక్రయాలు13 శాతం తగ్గి 41,871 యూనిట్లకు చేరుకున్నాయి. కొత్త లాంచ్‌లు 34 శాతం తగ్గాయి. గతేడాది ఇదే కాలంలో 47,985 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. దేశంలో వెస్ట్ జోన్ మొత్తం అమ్మకాలలో అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్, సూరత్, గోవా, నాసిక్, నాగ్‌పూర్‌ల వాటా 72 శాతం. కనెక్టివిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో వృద్ధి ఉన్నప్పటికీ, పెట్టుబడిదారులను ఆకర్షించడంలో టైర్ 2 నగరాలు విఫలమయ్యాయని ట్రూ నార్త్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈఓ రోచక్ బక్షి తెలిపారు.