టెలికాం సంస్థ జియో సేవల్లో అంతరాయం ఏర్పడింది. జియో మొబైల్ నెట్‌వర్క్‌తో పాటు జియో ఫైబర్ సేవలకూ అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కస్టమర్లు సోషల్‌మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా ముంబయి వాసులు ఎక్కువగా ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం.. జియో సేవల్లో అంతరాయంపై 10వేల మందికిపైగా యూజర్లు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. నో నెట్‌వర్క్, మొబైల్ ఇంటర్నెట్, జియో ఫైబర్ సేవల గురించి ప్రధానంగా ఫిర్యాదులు అందాయి. జియో సేవల్లో అంతరాయంపై ఆ కంపెనీ స్పందించింది. టెక్నికల్ ఇష్యూ కారణంగా ముంబయి వాసులు సేవల్లో అంతరాయం ఎదుర్కొన్నట్లు తెలిపింది. సమస్యలు పరిష్కరించామని, సేవలు యథాతథంగా అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొంది. సబ్‌స్క్రైబర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని విచారం వ్యక్తం చేసింది.