Renault Duster : క్రెటా, సెల్టోస్ కథ కంచికేనా? రెనాల్ట్ డస్టర్ ఎంట్రీతో మార్కెట్లో సరికొత్త వార్.

Update: 2026-02-16 11:04 GMT

Renault Duster : హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌లకు చెమటలు పట్టించేలా, మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రకంపనలు సృష్టించేందుకు రెనాల్ట్ డస్టర్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అట్టహాసంగా ప్రారంభించబోతోంది. ఒకప్పుడు భారత రోడ్లపై రారాజుగా వెలిగిన డస్టర్, ఇప్పుడు 2026 మోడల్‌గా సరికొత్త హంగులతో మార్చిలో లాంచ్ కానుంది. ఈసారి కేవలం లుక్స్‌తోనే కాకుండా, అత్యంత శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజిన్, ఫీచర్లతో ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది.

కొత్త రెనాల్ట్ డస్టర్ కోసం దేశవ్యాప్తంగా బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కేవలం రూ.21,000 టోకెన్ అమౌంట్‌తో ఈ కారును రిజర్వ్ చేసుకోవచ్చు. మార్చి మధ్య నాటికి కంపెనీ అధికారికంగా ధరలను వెల్లడించనుంది. ఏప్రిల్ 2026 నుంచి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. క్రెటా, సెల్టోస్, గ్రాండ్ విటారా వంటి దిగ్గజాలు రాజ్యమేలుతున్న ఈ సెగ్మెంట్‌లో డస్టర్ మళ్ళీ తన పాత వైభవాన్ని సంపాదించుకోవడమే లక్ష్యంగా దిగుతోంది.

మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం.. కొత్త డస్టర్ బేస్ వేరియంట్ ధర సుమారు రూ.10 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ ఎండ్ వేరియంట్ రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండే అవకాశం ఉంది. ఇదే జరిగితే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్రెటా (రూ.10.79 లక్షలు), సెల్టోస్ (రూ.10.99 లక్షలు) కంటే తక్కువ ధరకే డస్టర్ అందుబాటులోకి రానుంది. ఈ ప్రైస్ వార్ వల్ల మధ్యతరగతి కుటుంబాలకు ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది.

కొత్త డస్టర్ లైన్-అప్‌లో ఇంజిన్ ఆప్షన్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి

1.0 లీటర్ టర్బో: 100 bhp పవర్ ఇచ్చే ఈ ఇంజిన్ బడ్జెట్ ప్రియుల కోసం.

1.3 లీటర్ టర్బో: 163 bhp పవర్ ఇచ్చే ఈ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం.

1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్: ఇది ఈ సెగ్మెంట్‌లోనే అత్యంత పవర్పుల్ హైబ్రిడ్ ఇంజిన్. ఇది 160 bhp పవర్, 172 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మారుతీ గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ (116 bhp) కంటే ఇది ఎంతో పవర్‌ఫుల్ కావడం విశేషం. ఈ హైబ్రిడ్ వెర్షన్ దీపావళి 2026 నాటికి మార్కెట్లోకి వస్తుంది.

డస్టర్ అంటేనే అడ్వెంచర్. ఈ కొత్త మోడల్ కూడా ఆఫ్-రోడింగ్‌లో తన సత్తా చాటనుంది. ఈ కారుకు 26.9 డిగ్రీల అప్రోచ్ యాంగిల్, 34.7 డిగ్రీల డిపార్చర్ యాంగిల్ ఉన్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా సుమారు 212-217 mm ఉండటంతో కొండలు, గుట్టలపై అలవోకగా దూసుకెళ్తుంది. ఇందులో ఏకంగా 700 లీటర్ల బూట్ స్పేస్ ఉంది, ఇది తన సెగ్మెంట్‌లోనే అత్యధికం. 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్-2 ADAS వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రెనాల్ట్ తన కస్టమర్ల నమ్మకాన్ని పెంచేందుకు 7 ఏళ్లు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల భారీ వారంటీని ఆఫర్ చేస్తోంది.

Tags:    

Similar News