iPhone 15 : ఐఫోన్‌ 15 కొంటే ఇయర్‌ బడ్స్‌ ఫ్రీ

Update: 2024-10-04 12:45 GMT

భారత్​లో యాపిల్‌ దీపావళి సేల్‌ ప్రారంభమైంది. ప్రత్యేక డిస్కౌంట్లు, బ్యాంక్‌ ఆఫర్లతో ఈ డీల్‌ మొదలైంది. ఐఫోన్లతో పాటు, మ్యాక్‌బుక్‌, ఐప్యాడ్‌.. ఇలా పలురకాల యాపిల్‌ ఉత్పత్తులపై పెద్దఎత్తున డిస్కౌంట్స్ అందిస్తోంది. ఐఫోన్‌ 15 కొనుగోలు చేసినవారికి ఉచితంగా బీట్స్‌ సోలో బడ్స్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. యాపిల్‌ దీపావళి సేల్‌లో కార్డులపై రూ.10వేల వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డుదారులు మాత్రమే ఈ డిస్కౌంట్స్​ను పొందొచ్చు. ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌తో పాటు కార్డ్‌ హోల్టర్లకు 12 నెలల పాటు నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం అందిస్తోంది. ఇక ఐఫోన్16 సిరీస్‌ మొబైల్స్‌పై రూ.5వేలు, మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎం3, మ్యాక్‌బుక్‌ ప్రో పై రూ.10వేల వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ఎం2పై రూ.8వేలు వరకు క్యాష్‌బ్యాక్‌ అందిస్తున్నట్లు యాపిల్‌ ప్రకటించింది.

Tags:    

Similar News