Good News : అందరికీ గుడ్డు న్యూస్.. రేటు తగ్గిందోచ్

Update: 2024-05-11 07:54 GMT

సామాన్యులకు ఊరటనిస్తూ.. చికెన్ రేట్లు, కోడిగుడ్ల రేట్లు తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా చికెన్‌ ధరలు పెరిగాయి. దీంతోపాటు కోడి గుడ్ల రేట్లను కూడా పౌల్ట్రీ సంస్థలు పెంచేశాయి. అయితే ఎండల వేడికి తట్టుకోలేక కోళ్లు భారీగా మృత్యువాత చెందిన క్రమంలో ఈ రేట్లు పెరిగినట్లు పౌల్ట్రీ యజమానులు చెప్పారు.

ఇటివల కురిసిన వర్షాల నేపథ్యంలో మళ్లీ సామాన్య ప్రజలకు ఊరట లభించింది. ఈ నేపథ్యంలో తాజాగా కోడి గుడ్ల ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. ఒక కోడి గుడ్డు ధర రూ.5.25 నుంచి ఈరోజు రూ. 4.8కి చేరుకుంది. మరోవైపు డజన్ కోడి గుడ్లను రూ. 57కు సేల్ చేస్తున్నారు. ఈ వాతావరణం ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో కోడి గుడ్ల ధరలు మరింత తగ్గుతాయని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు.

ఎండల కారణంగా అనేక కోళ్లు మృత్యువాత చెంది నష్టపోయినట్లు పౌల్ట్రీ నిర్వాహకులు తెలిపారు. ఆ సమయంలో కోళ్లతోపాటు గుడ్ల సరఫరాపై కూడా ప్రభావం చూపిందని అన్నారు. ఇదే నెలలో పది రోజుల క్రితం ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండటం విశేషం. కోడి గుడ్ల ధరలు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి.

Tags:    

Similar News