Good News for Diabetic Patients : డయాబెటిస్ పేషెంట్లకు గుడ్ న్యూస్.. మందుల ధరలు తగ్గాయి
లోక్ సభ ఎన్నికల వేళ డయాబెటిస్, గుండె సంబంధ పేషెంట్లకు గుడ్ న్యూస్ అందింది. గుండె, కాలేయం, మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స పరంగా శుభవార్త అందింది.
ఈ వ్యాధులకు వాడే మందుల ధరలను భారీగా తగ్గించింది.
కేవలం ఈ వ్యాధులకు వాడే మెడిసిన్స్ ధరలు మాత్రమే కాదు సాధారణంగా వినియోగించే 41 రకాల మందుల ధరలను సైతం తగ్గించింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో డీలర్లు, స్టాకిస్టులకు తక్షణమే ఈ సమాచారాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కంపెనీలను ఆదేశించింది.
అయితే ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఔషదం ధరకు అదనంగా జీఎస్‌టీని మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలలో స్పష్టం చేశారు. మనదేశంలో మధుమేహ బాధితులు లక్షల సంఖ్యలో ఉన్నారు. మందులు, ఇన్సులిన్‌పై ఆధారపడే వారికి ధరల తగ్గింపు పెద్ద ఉపశమనంగానే చెప్పుకోవాలి.