రూపే క్రెడిట్ కార్డులకు సైతం సాధారణ క్రెడిట్ కార్డులతో సమానంగా రివార్డు పాయింట్లు ఇవ్వాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ బ్యాంకులను ఆదేశించింది. సెప్టెంబర్ 1 నుంచి తమ ఆదేశాలు పాటించాలంది. క్రెడిట్ కార్డులతో UPI పేమెంట్స్ చేసేందుకు బ్యాంకులు రూపే కార్డులను అందిస్తున్నాయి. అయితే వీటిపై ఇస్తున్న రివార్డులు ఇతర కార్డుల కంటే తక్కువ. దీంతో కార్డుల వినియోగం పెంచేందుకు ఈ అంతరాన్ని తొలగించాలని NPCI ఆదేశాలిచ్చింది.
‘‘క్రెడిట్ కార్డు రివార్డులు అనేవి కార్డు వినియోగం పెంచడంలో కీలక భూమిక పోషిస్తాయి. రూపే క్రెడిట్ కార్డు, రూపే క్రెడిట్ కార్డు యూపీఐ లావాదేవీలపై అందించే ప్రయోజనాలు.. ఇతర కార్డు లావాదేవీలపై అందిస్తున్న రివార్డులు, ఇతర ప్రయోజనాలతో పోలిస్తే ఏమాత్రం తక్కువ కాకుండా చూసుకోవాలి’’ అని ఎన్‌పీసీఐ బ్యాంకులకు సూచించింది. సెప్టెంబర్ 1 నుంచి తమ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని పేర్కొంది. ఇంటర్‌ఛేంజ్ ఫీజు వర్తించే లావాదేవీలను దీన్నుంచి మినహాయించింది.