Flipkart Big Savings: గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7ఏపై భారీ తగ్గింపు..
ఈ రెండు మోడళ్లలో గూగుల్ టెన్సార్ G2 చిప్‌సెట్‌తో పనిచేస్తూ, 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమొరీతో రానున్నాయి. నూతన ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో సాఫ్ట్‌వేర్ పనిచేస్తోంది.;
గూగుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు పిక్సెల్ 7(PIXEL 7), పిక్సెల్ 7ఎ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ సేల్(Flipkart Big Saving Days)లో తక్కువ ధరల్లోనే లభిస్తోంది. 50 వేల కంటే తక్కువ ధరల్లోనే ఈ రెండు మొబైళ్లు లభిస్తున్నాయి. చూడడానికి ఈ రెండు ఫోన్లు ఒకేలా ఉన్నా, కొన్ని ఫీచర్లలో తేడాలు ఉంటాయి. పిక్సెల్ 7 రూ.12000 తగ్గి, 47,999లో లభిస్తుండగా, పిక్సెల్ 7ఏ రూ.43,999ల్లో లభిస్తోంది. బ్యాంకులు, క్రెడిట్ కార్డులు అందించే ఆఫర్ల ద్వారా ఈ ధర మరింతగా తగ్గనుంది. పిక్సెల్ 7పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు లభించనుంది. HDFC క్రెడిట్ కార్డులను ఉపయోగించడం ద్వారా పిక్సెల్ 7ఏపై 4000 వరకు తగ్గి 39,999కు లభించనుంది. పిక్సెల్ 7 46,749గా లభించనుంది. అయితే పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మరింత డిస్కౌంట్ రానుంది.
ఈ రెండు మోడళ్లలో గూగుల్ టెన్సార్ G2 చిప్‌సెట్‌తో పనిచేస్తూ, 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమొరీతో రానున్నాయి. నూతన ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో సాఫ్ట్‌వేర్ పనిచేస్తోంది.
రెండింటి మధ్య పోలికలు ఇవే..
పిక్సెల్ 7 గ్లాస్ బ్యాక్, మెటల్ ఫ్రేంతో ధృడమైన నాణ్యతతో ఉండగా, పిక్సెల్ 7ఏ ప్లాస్టిక్ ఫ్రేంతో తయారుచేశారు. రెండు ఫోన్లలో మెమరీ కాన్ఫిగరేషన్ కూడా ఒకేలా ఉంటుంది. పిక్సెల్ 7ఏ 6.1 అంగుళాల OLED స్క్రీన్ ఉండగా, పిక్సెల్ 7లో 6.32 అంగుళాల OLED టచ్‌స్క్రీన్ ఉంది.
కెమెరా విషయానికి వస్తే పిక్సెల్ 7ఏ 64ఎంపీ మెయిన్ కెమెరాతో పాటు, 13-ఎంపీల అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అమర్చారు. పిక్సెల్ 7ఏ 50-ఎంపీ మెయిన్ కెమెరా, 12-ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంచారు. మెగా పిక్సెల్ తక్కువ ఉన్నపటికీ ఎక్కువ కలర్లతో, మరింత స్పష్టమైన చిత్రాలు అందించగలరు. రెండు ఫోన్లు బ్యాటరీలు సుమారుగా సేమ్‌గానే ఉన్నాయి. రెండు ఫోన్లు వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం విశేషం.
రెండు మోడళ్ల ఫీచర్స్‌ను పోలిస్తే రెండూ అటూఇటూగా ఒకే ఫీచర్స్ అందిస్తున్నాయి. కెమెరా, డిస్‌ప్లే విషయంలో మాత్రం పిక్సెల్ 7 ఫోన్ ముందులో ఉంటుంది. ఫోన్ బాడీ నాణ్యత కూడా పరిగణలోకి తీసుకుంటే పిక్సెల్ 7 మరింత ముందు వరసలో ఉంటుంది. ఫోన్ బాడీ నాణ్యతో రాజీ పడాలనుకుంటే పిక్సెల్ 7ఏ కూడా మంచి ఛాయిసే.