గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వచ్చేస్తోంది.. తొందరలోనే తేదీలను ప్రకటించనున్న అమెజాన్
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ పండగ వేళ అతిపెద్ద సేల్‌కు సిద్ధమైంది. ఏటా నిర్వహించే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను ఈ నెలాఖరులో నిర్వహించనుంది. త్వరలో తేదీలను ప్రకటించనుంది. ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందే సేల్ అందుబాటులోకి రానుంది. ఈ సారి అమెజాన్ సేల్‌లో ఎస్‌బీఐ కార్డు యూజర్లకు డిస్కౌంట్ లభించనుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుతో చేసే కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు పొందొచ్చు. సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై 40 శాతం, ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం, హోమ్ డెకరేట్స్ పై 50 శాతం, ఫ్యాషన్ ప్రొడక్ట్స్ పై 50-80 శాతం, అమెజాన్ అలెక్స్ ప్రొడక్ట్స్ పై 55 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. దేనిపై ఎంత డిస్కౌంట్ ఇచ్చేది మాత్రం వెల్లడించలేదు. అలాగే, శాంసంగ్ ఎం35 5జీ, శాంసంగ్ ఎస్24 అల్ట్రా, శాంసంగ్ ఏ35 డివైజెస్ పై డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు అమెజాన్ చెబుతోంది. అయితే, ఈ నెల 27నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ డేస్ సేల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.