Harley Davidson X440 : రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పక్కా పోటీ.. ఎక్స్440 బైక్‌పై భారీ డిస్కౌంట్.
Harley Davidson X440 : ప్రముఖ అంతర్జాతీయ బైక్ తయారీ సంస్థ హార్లే డేవిడ్‌సన్, భారతదేశంలో తమ అత్యంత చవకైన మోడల్ అయిన X440 బైక్ ధరను తగ్గించి కస్టమర్‌లకు ఊరటనిచ్చింది. ఈ తగ్గింపుతో కస్టమర్లు ఇప్పుడు రూ.24,600 వరకు ఆదా చేసుకోగలుగుతారు. కంపెనీ ప్రస్తుతం ఈ బైక్‌ను కేవలం రెండు వేరియంట్‌లలో మాత్రమే విక్రయిస్తోంది. ఇందులో అత్యంత చవకైనదైన డెనిమ్ వేరియంట్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
హార్లే డేవిడ్‌సన్ X440 రెండు వేరియంట్‌లలో ధరల తగ్గింపు ఎంత ఉందో తెలుసుకుందాం. Vivid వేరియంట్ ధరలో రూ.20,000 తగ్గింపు ప్రకటించారు. తగ్గింపు తర్వాత దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.2,34,500గా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన S వేరియంట్ పై అత్యధికంగా రూ.24,600 తగ్గింపు లభించింది. తగ్గింపు తర్వాత దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.2,54,900గా ఉంది. ధరల్లో తగ్గింపు మినహా, హార్లే డేవిడ్‌సన్ X440లో మరే ఇతర టెక్నాలజీ లేదా డిజైన్ పరమైన మార్పులు చేయలేదు.
హార్టీ డేవిడ్ సన్ X440 బైక్, దేశీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వడానికి ఈ ధరల తగ్గింపు దోహదపడుతుంది. ఈ బైక్‌లో 440 సీసీ ఇంజిన్ అమర్చారు, ఇది 6000 ఆర్‌పిఎం వద్ద 27bhp పవర్‌ను, 4000 ఆర్‌పిఎం వద్ద 38Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్, స్లిప్ అసిస్ట్ క్లచ్‌తో వస్తుంది. సేఫ్టీ కోసం ముందు వైపున 320ఎంఎం డిస్క్, వెనుక వైపున 240ఎంఎం డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)తో పాటు ఇచ్చారు.
ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టాప్ వేరియంట్‌లో కనెక్టెడ్ ఫీచర్ల సపోర్ట్, మొబైల్ ఛార్జింగ్ కోసం USB పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వివిడ్, ఎస్ వేరియంట్‌ల మధ్య ప్రధానంగా కాస్మెటిక్, కనెక్టివిటీ ఫీచర్లలో తేడాలు ఉన్నాయి. వివిడ్ వేరియంట్లో డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, బ్రాంజ్, మెషిన్డ్ ఇంజిన్ ఫినిష్, కనెక్టెడ్ ఫీచర్లు ఉండవు. ఇది గోల్డ్‌ఫిష్ సిల్వర్, మస్టర్డ్, మెటాలిక్ డార్క్ సిల్వర్, మెటాలిక్ థిక్ రెడ్ వంటి రంగులలో లభిస్తుంది. S వేరియంట్ కేవలం మ్యాట్ బ్లాక్ మరియు బాజా ఆరెంజ్ రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.