పాపులర్ కార్ల తయారీ సంస్థ హోండా భారత మార్కెట్లోకి మరో సరి కొత్త మోడల్ కారును విడుదల చేసింది. హోండా అమేజ్ పేరుతో విడుదలైన ఈ కారు ప్రారంభ ధర రూ. 7.99 లక్షలుగా నిర్ణయించారు. అయితే టాప్ మోడల్ ధర రూ.10.89 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా ఉండనుంది.
రంగులు
కొత్తగా విడుదలైన హోండా అమేజ్ కారు అబ్సిడి యన్ బ్లూ కలర్తో పాటు.. ఆరు రంగులలో లభిస్తుంది. అభిరుచి, కొనాలనే ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు సంబంధిం చిన డీలర్లను సంప్రదించి కారు బుక్ చేసుకోవచ్చు. అలాగే హోండా కంపెనీ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా కూడా ఆన్ లైన్ లో బుక్ చేయొచ్చు.
ఇంటీరియర్
ఇక కారు లోపలి భాగం విషయానికి వస్తే నలుపు, గోధుమ రంగుతో కుడిన డ్యుయల్ టోన్ అష్తోల్సరీ ఉంటుంది. సెంటర్ టన్నెల్, డోర్ ప్యాడ్స్, అధునాతమైన సీటింగ్ వ్యవస్థను, అధునాతన టెక్నాలజీ అందించారు. మౌంటెడ్ ఆడియో కంట్రోల్ బటన్స్, ఆటోమేటిక్ క్లెమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, లేన్ వాచ్ అసిస్ట్, 8 ఇంచుల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ తో కూడిన మల్లీ ఫం క్షనల్ స్టీరింగ్ వీల్ వంటి సదుపాయాలు కల్పించారు.
ఫీచర్స్
తాజాగా మార్కెట్లోకి విడుదలైన అమేజ్లో కారు లోపల, బయట ఎన్నో రకాల కొత్త ఫీచర్లను అందిస్తున్నారు. ఫ్రంట్ లో ఫ్రెష్ గ్రిల్, పవర్ ఫుల్ అప్డేటెడ్ ఎల్ఈడీ హెడ్ లైట్ సెటప్, ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్తో లింక్ చేశారు. ఫాగ్ లాంప్ ప్లేస్ మెంట్ చేశారు. దీంతో కారు మరింత ప్రీమియంగా కనిపించనుంది. వెనుక భాగంలో సీ ఆకారంలో టైల్ లైట్ క్రోమ్ బార్ ను ఇచ్చారు.
ఇంజిన్ పవర్
ఈ రకం కారులో 1.2 లీటర్, నాలుగు సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ను అందించారు. ఇది గరిష్ఠంగా 86 బీహెచ్పీ శక్తిని, 110 ఎన్ఎమ్ మ్యాక్సిమమ్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ట్రాన్ మిషన్ విషయానికొస్తే, ఐదు స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంటుంది.